Table of Contents
Game Changer Ramcharan Shirish.. అహంకారం పెరిగిపోయింది.. పొగరు నెత్తికెక్కింది.. లేకపోతే, అలా ఎలా నోటికొచ్చింది వాగుతాడు.?
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా విషయమై, ఆ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయిన శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించే ఇదంతా.
ఓ ఇంటర్వ్యూలో శిరీష్ రెడ్డి, ‘గేమ్ ఛేంజర్’ హీరో రామ్ చరణ్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సినిమా ఫ్లాపయితే, ఫోన్ కూడా చేయలేదంటూ శిరీష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశాడు.
రామ్ చరణ్ ఎందుకు ఫోన్ చెయ్యాలి.?
‘గేమ్ ఛేంజర్’ సినిమా నిర్మాత దిల్ రాజు, తాను రామ్ చరణ్‌తో హిట్ సినిమా తీయలేకపోయాననీ, హిట్ సినిమా తీసే ప్రయత్నాల్లో వున్నాననీ తాజాగా వ్యాఖ్యానించాడు.
సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’తోపాటు, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విడుదలయ్యేందుకు రామ్ చరణ్, చిరంజీవి ఇచ్చిన సహకారం అంతా ఇంతా కాదని దిల్ రాజు చెప్పారు.
అంతే కాదు, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత, తనకు అవకాశం రామ్ చరణ్ ఇవ్వడం గొప్ప విషయమనీ, మూడేళ్ళకు పైనే, ‘గేమ్ ఛేంజర్’ కోసం చరణ్ కమిట్ అవ్వడం తానెప్పుడూ మర్చిపోనని దిల్ రాజు అన్నారు.

త్వరలోనే రామ్ చరణ్‌తో సినిమా ప్లాన్ చేయనున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. నిర్మాతకీ, హీరోకీ మధ్యన ఇంత పాజిటివిటీ వున్నప్పుడు, ఈ శిరీష్ రెడ్డికి వచ్చిన నొప్పి ఏంటి.?
అసలంటూ శిరీష్ రెడ్డికి రామ్ చరణ్ ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంటుంది.? దిల్ రాజుతో కదా, రామ్ చరణ్ ఏదైనా మాట్లాడాల్సింది.
Game Changer Ramcharan Shirish.. శిరీష్ రెడ్డికి సంబంధమే లేదు..
తాను ‘గేమ్ ఛేంజర్’ సినిమాని చూసుకున్నాననీ, శిరీష్ మాత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గురించే చూసుకున్నాడనీ, ‘గేమ్ ఛేంజర్’తొ శిరీష్‌కి సంబంధం లేదని దిల్ రాజు చెప్పడం గమనార్హం.
అయితే, మొదటి సారి ఇంటర్వ్యూ ఇచ్చిన శిరీష్, మాట్లాడటం చేతకాక.. ఆవేశంలో ఏదో అనేశాడనీ, టార్గెట్ చేసి ప్రశ్నలడిగితే, కంగారులో ఏదో చెప్పేశాడనీ దిల్ రాజు వివరణ ఇచ్చుకున్నాడు.

కట్ అండ్ పేస్ట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయని తెలియనంత అమాయకుడా శిరీష్ రెడ్డి.? ‘దిల్’ రాజు బ్యానర్‌లో సినిమాలు నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలూ చూసుకుంటున్నాడాయన.
ఆ మధ్య ‘హరి హర వీర మల్లు’ సినిమా విడుదల.. సినిమా థియేటర్ల బ్యాన్ రచ్చ సమయంలోనూ, ఈ శిరీష్ రెడ్డి పేరే ప్రముఖంగా తెరపైకొచ్చంది.
డ్యామేజ్ కంట్రోల్ అయినట్లేనా.?
నిర్మాత దిల్ రాజు వివరణ మాత్రమే కాదు, మెగాభిమానుల ఒత్తిడితో శిరీష్ రెడ్డి ‘క్షమాపణ లేఖ’ కూడా విడుదల చేయడంతో, ఈ వివాదం ఇప్పటికి సద్దుమణిగినట్లే.
సినిమా వచ్చి, ఆర్నెళ్ళ పైనే అయ్యింది.. కానీ, ‘గేమ్ ఛేంజర్’ ప్రస్తావన లేకుండా, ‘దిల్’ రాజు మీడియా ముందుకు రాలేని పరిస్థితి.
Also Read: కాంటా లాగా షెఫాలీ జరీవాలా.! అసలేమైంది.?
మీడియా, దిల్ రాజుని టార్గెట్ చేస్తోందని తెలిసీ, ‘గేమ్ ఛేంజర్’ సినిమా విషయమై శిరీష్ రెడ్డి నోరు జారడం, అదీ రామ్ చరణ్ ప్రస్తావన తీసుకురావడం వెనుక బలమైన కారణం ఏదో వుండే వుంటుంది.
ఆ కారణం, మెగా కాంపౌండ్ మీద శిరీష్ రెడ్డికి వున్న అక్కసు అనుకోవాలా.? లేదంటే, వ్యక్తిగత ద్వేషం ఏమైనా ఆయనకుందా.?