Samantha Ruth Prabhu.. తాజా మాజీ భర్తకు ఆ హీరోయిన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదట. దాంతో ఆ హీరోయిన్ మీద ఆమె మాజీ భర్త అయిన ఆ హీరో గారి అభిమానులు సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. తమ సోషల్ పైత్యాన్నంతా వాడేశారు. బూతులు తిట్టేశారు. శాపనార్ధాలూ పెట్టారు.
పరిచయం అక్కర్లేని పేర్లవి. సమంత, నాగ చైతన్య. ఈ ఇద్దరూ తెలుగు సినీ పరిశ్రమలో రీల్ అండ్ రియల్ లైఫ్ బెస్ట్ కపుల్ అని చాలా మంది భావించారు. కానీ, వీరి వైవాహిక బంధం శాశ్వతంగా నిలబడలేదు. వారి వారి వ్యక్తిగత పరిస్థితుల కారణంగా ఇద్దరూ కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు.
Samantha Ruth Prabhu రూటే సెపరేటు
‘కందకు లేని దురద కత్తిపీటకెందుకు..’ అని పెద్దలు చెప్పినా సో కాల్డ్ వెర్రి అభిమానులకు అదేమీ పట్టలేదు. నాగచైతన్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పకుండా, పెంపుడు కుక్కకి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తావా.? అని సో కాల్డ్ అభిమానులు తెగ దీర్ఘాలు తీశారు.

ఎవరి ఇష్టం వాళ్లది. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాకా, వారి వారి ప్రయివేటు జీవితాలూ, పబ్లిక్ జీవితాలూ వాళ్ల ఇష్టం. ఒకరి మీద ఇంకొకరికి ప్రేమో, ఇష్టమో, గౌరవమో, అభిమానమో, స్నేహమో ఖచ్చితంగా ఉండాలనే రూల్ అయితే లేదు.
సమంత తప్పు చేసిందా.?
సో, ఇక్కడ సమంతను తప్పుపట్టడానికి లేదు. సమంతపై అనవసరంగా కామెంట్లు చేయడం ద్వారా నాగ చైతన్య స్థాయిని తగ్గించకూడదన్న ఇంగితం సో కాల్డ్ అభిమానులకు ఇకనైనా కలగాలి. కానీ, వెర్రి అభిమానుల నుంచి అలాంటి మార్పు ఆశించలేం.
Also Read: Priyanka Chopra ‘ప్రేమకథ’కి ఏమైంది చెప్మా.?
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో హేటర్స్ అని ప్రత్యేకంగా ఉంటారు. వాళ్లే ఇలాంటి తప్పుడు పనులు చేస్తుంటారు. ఏమో, నాగ చైతన్య (Akkineni Naga Chaitanya), సమంత (Samantha) కలిసి సినిమాల్లో నటిస్తారేమో. వాళ్లిద్దరి మధ్యా ముందు ముందు గౌరవాభిమానాలు ఏర్పడతాయేమో. ఎవరు చెప్పగలరు.?