Samantha Ruth Prabhu Idly.. ‘థ్యాంక్ గాడ్.. విజయవాడలో ఇడ్లీ స్టాల్ పెట్టాల్సి రాలేదు..’ అంటూ సినీ నటి సమంత, ‘ఖుషి’ మ్యూజికల్ షో సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ఇది. మయోసైటిస్ కారణంగా, సమంత ‘ఖుషి’ సినిమా షూటింగ్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది.
‘సమంత, తిరిగి సినిమాల్లోకి రావడానికి చాలా సమయం పడుతుందని భయపడ్డాం.. ఆమె ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కానీ, సినిమా పూర్తి చేసింది’ అని తాజాగా చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.
Samantha Ruth Prabhu Idly.. విజయ్ చెప్పిన ఇడ్లీ బండి కథ.!
అంతకు ముందు ఓ మీడియా ఇంటరాక్షన్‌లో మాట్లాడిన విజయ్, ‘సమంత కోసం పదేళ్ళయినా ఎదురుచూడాలని నేను, శివ నిర్వాణ అనుకున్నాం..’ అని చెప్పాడు.
‘నేను, శివ నిర్వాణ.. ఇద్దరం కలిసి విజయవాడ హైవేలో ఇడ్లీ బండి పెడదామనుకున్నాం. సమంత ఇడ్లీ పేరుతో ఆ బండి పెట్టాలనుకున్నాం..’ అని విజయ్ చెప్పడం గమనార్హం.

విజయ్ చేసిన ఆ ఇడ్లీ బండి వ్యాఖ్యల్నే ప్రస్తావించిన సమంత, ‘ఖుషి’ మ్యూజికల్ నైట్ సందర్భంగా, ‘థాంక్ గాడ్.. ఇడ్లీ బండి పెట్టాల్సిన అవసరం రాలేదు’ అని చెప్పిందన్నమాట.
Also Read: Rashmika As Love Interest Of Dhanush.!
కాగా, విజయ్ – సమంత – ఇడ్లీ బండి వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతోంది.
‘ఇందుకే కదా, అక్కినేని నాగ చైతన్య నిన్ను వదిలించుకున్నది..’ అంటూ అక్కినేని అభిమానులు సమంత మీద మండిపడుతున్నారు.

ఇదిలా వుంటే, ‘బ్లాక్ బస్టర్ ఇస్తా.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తా..’ అంటూ సమంత, ‘ఖుషి’ మ్యూజికల్ ఈవెంట్ సందర్భంగా అభిమానుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.
సమంత ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదనీ, ఆమె మీద ఎక్కువ లైటింగ్ పడితే, కళ్ళు ఎర్రగా అయిపోతుంటాయనీ, విపరీతమైన తలనొప్పి వస్తుందని విజయ్ దేవరకొండ చెప్పాడు.