Samantha Ruth Prabhu Subham.. సినీ నటి సమంత, సినీ నిర్మాతగా మారింది. ‘శుభం’ పేరుతో ఓ సినిమా తెరకెక్కించింది కూడా. ఆ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది.
దాదాపుగా కొత్త నటీనటులతో ‘శుభం’ సినిమాని నిర్మించింద సమంత. సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, నటీనటుల కష్టానికి తగ్గ పారితోషికం ఇస్తున్నట్లు చెప్పింది.
పనికి తగ్గ పేమెంట్ ఖచ్చితంగా వుండాల్సిందే.. ఇందులో, ఆడ – మగ.. అన్న తేడాలుండకూడదని ‘శుభం’ సినిమాతో నిర్మాతగా మారిన సమంత సెలవిచ్చింది.
గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో, ‘హీరోయిన్లకు పేమెంట్ తక్కువ.. అదే, హీరోలకైతే పేమెంట్ ఎక్కువ..’ అన్న చర్చ నడుస్తోంది.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఈ అంశమై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
Samantha Ruth Prabhu Subham.. హీరోలు వేరు.. హీరోయిన్లు వేరు..
నిజమే, స్టార్ హీరోలకు పేమెంట్.. వేరే రేంజ్‌లో వుంటోంది. స్టార్ హీరోయిన్లకు అందులో సగం కాదు కదా, పదోవంతు కూడా రెమ్యునరేషన్ వుండదు.
అన్ని సందర్భాల్లోనూ ఇలాగే జరుగుతోందా.? అంటే, ఒక్కోసారి సినిమాలో హీరోల కంటే, హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎక్కువగా వుంటుంటుంది.

అది కూడా, స్టార్ హీరోయిన్లు చేసే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే సుమీ.! ఆ లెక్కన చూస్తే, హీరోయిన్లకు అన్యాయమే జరుగుతోంది రెమ్యునరేషన్ విషయంలో హీరోలతో పోల్చితే.
గతంలో సమంత కూడా, లేడీ ఓరియెంటెడ్ సినిమాల కోసం హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న సందర్భాలున్నాయి.
Also Read: Touch Me Not Review: సమీక్ష.. బిగుసుకుపోయి, ఓవరాక్షన్ చేసేసి.!
ఏదిఏమైనా, సమానమైన పనికి.. సమానమైన పేమెంట్.. అంటూ, నిర్మాత సమంత చేసిన ప్రకటన ఆహ్వానించదగ్గదే.
చిన్న సినిమాలకు ఓకే.. పెద్ద సినిమాలకు నిర్మాతగా సమంత వ్యవహరిస్తే.. అప్పుడూ, ఇలానే ఆమె ఈక్వల్ పేమెంట్స్ చేస్తుందా.? వేచి చూడాల్సిందే.
బాలీవుడ్ భామలు తాప్సీ, అలియా భట్, దీపికా పడుకొనేతోపాటు సౌత్ బ్యూటీస్ నయనతార తదితరులు హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ కోసం గళం విప్పినవారే.