Samantha Ruth Prabhu Yashoda.. సమంత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందట.! సమంత ఇకపై గర్భం దాల్చే అవకాశం లేదట.. ఎందుకంటే, ఆమె గర్భాన్ని తొలగించుకుందట.!
బహుశా సినీ పరిశ్రమలో ఏ హీరోయిన్ కూడా ఎదుర్కోనంత ట్రోలింగ్ సమంత (Samantha Ruth Prabhu) తరచూ ఎదుర్కొంటుందనడం సబబేమో.! వైవాహిక జీవితం ‘విచ్ఛిన్నం’ అయ్యాక సమంతకి ఎదురైన పరిస్థితి ఇది.
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యశోద’ (Yashoda Movie) సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని, ఆమె నిజ జీవితానికి ఆపాదించేస్తున్నారు కొందరు.
చెయ్యకూడనివన్నీ చేసేసింది..
‘యశోద’ సినిమాలో సమంత (Samantha Ruth Prabhu) ఓ ప్రెగ్నెంట్ లేడీలా కనిపించబోతోంది.
ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యురాలు చెబుతుంటుంది. కానీ, అందుకు భిన్నంగా ‘యశోద’ Samantha Yashoda) జీవితం నడుస్తుంటుంది.
కాన్సెప్ట్ కొత్తగా వుంది కదా.! ఈ నేపథ్యంతో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయ్. అయితే, ‘యశోద’ (Yashoda) వాటన్నిటికంటే చాలా చాలా భిన్నమైన సినిమాలా కనిపిస్తోంది.
Samantha Ruth Prabhu Yashoda.. సమంత సింప్లీ సూపర్బ్..
నటిగా సమంతకి (Samantha Ruth Prabhu) వంకలు పెట్టాల్సిన పనే లేదు. ఎందుకంటే, గతంలో చాలా సినిమాలతో నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది సమంత. ఈసారి ఇంకో మెట్టు పైకెక్కబోతోందంతే.!
Also Read: అనసూయ ‘కర్మ’.! ‘అర్జున్ రెడ్డి’ పాపం ‘లైగర్’ని వెంటాడిందా.?
నిజానికి, సమంతకి (Samantha Ruth Prabhu) ఈ సినిమా ఓ ఛాలెంజ్. నటిగా తనను తాను మరింత ఘనంగా ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక చక్కటి అవకాశం.

టీజర్ (Yashoda Teaser) స్టార్ట్ అయ్యింది మొదలు పూర్తయ్యేదాకా.. గ్రిప్పింగ్‌గా డిజైన్ చేశారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. వాట్ నాట్.. అన్నీ అద్భుతంగా కుదిరినట్లే కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో బోల్డంత నెగెటివిటీ నేపథ్యంలో, సమంత ఆ నెగెటివిటీని తట్టుకుని ఏ స్థాయిలో ‘యశోద’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరిస్తుందో వేచి చూడాల్సిందే.
తమిళ, తెలుగు సహా పలు భాషల్లో ‘యశోద’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
