Samantha Salman Khan.. సౌత్ హీరోయిన్లకు బాలీవుడ్‌లో క్రేజ్ పెరుగుతోంది. ఒకప్పుడు సౌత్ భామల్ని నార్త్ అస్సలు పట్టించుకునేది కాదు. మారిన పరిస్థితుల నేపథ్యంలో సౌత్ ముద్దుగుమ్మలకు మంచి ఆదరణ దక్కుతోంది బాలీవుడ్‌లో.
తాజాగా నయన తార నటించిన ‘జవాన్’ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో, బాలీవుడ్ స్టార్ హీరోలంతా సౌత్ భామలపై దృష్టి పెట్టినట్లున్నారు.
అందులో భాగంగానే సమంతకు ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా సౌత్ భామని పరిశీలిస్తున్నారట.
Samantha Salman Khan.. సమంతని కాస్త రెస్ట్ తీసుకోనీయరూ.!
ఆ లిస్టులో త్రిష, సమంత పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయ్. అయితే, త్రిష ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా వున్న సంగతి తెలిసిందే.

దాంతో, సమంత పేరు దాదాపు ఫైనల్ చేశారనీ ప్రచారం జరుగుతోంది. ‘ఖుషి’ సినిమా తర్వాత సమంత అనారోగ్యం కారణంగా ఒక ఏడాది రెస్ట్ తీసుకోవాలనుకుంటోందట అన్న వార్త ఇటీవల హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ లోపే ఆమెకు బాలీవుడ్ నుంచి ఈ క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఆల్రెడీ బాలీవుడ్‌లో సమంత ‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌తో వీర లెవల్‌లో పాపులర్ అయ్యింది కూడా.
సమంతదే ఫైనల్ డెసిషన్..
దాంతో, సల్మాన్ ఖాన్ సినిమాలో సమంత అయితేనే క్రేజీగా వుంటుందని చిత్ర యూనిట్ అనుకుంటున్నారట. అన్నట్లు ఈ సినిమాని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తన హోమ్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.
కరణ్ జోహార్‌తో సమంతకు మంచి స్నేహం కూడా వుంది. సో, దాదాపు సమంత పేరు ఫైనల్ అయినట్లే అని తెలుస్తోంది. అయితే, అందుకు సమంత ఒప్పుకుంటుందా.? లేదా.? అని తెలియాల్సి వుంది.
Also Read: Pawan Kalyan.. ఏంటి పవన్ కళ్యాణ్ నీ గొప్ప.?
అంతేకాదండోయ్ ఈ సినిమాకి డైరెక్టర్ కూడా సౌత్‌కి సుపరిచితుడే. ఆయన మరెవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో గతంలో ‘పంజా’ సినిమా తెరకెక్కించిన విష్ణు వర్ధన్.