Table of Contents
Samantha Shocks Nagachaitanya టాలీవుడ్ క్యూట్ పెయిర్‌గా చెప్పబడే నాగ చైతన్య, సమంతలు అభిప్రాయ బేధాల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ విడాకుల ఇష్యూ టాలీవుడ్‌లో ఎంత సెన్సేషనల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
రోజులు, నెలలు గడిచినా కానీ, ఏదో ఒక మూల నుంచి ఈ ఇష్యూ లేవనెత్తుతూనే వున్నారు. ఎప్పుడు ఈ విషయాన్ని తెరపైకి తెచ్చినా ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తే.
తాజాగా మరోసారి చై, సామ్ విడాకుల ఇష్యూ తెరపైకి వచ్చింది. ఈ సారి స్వయంగా సమంత నోటి వెంటే ఈ సెన్సేషనల్ న్యూస్‌కి సంబంధించిన కొన్ని అన్‌హెర్డ్ సీక్రెట్స్ వినాల్సి వచ్చింది.
చై, సామ్ విడాకులు అంత సులువుగా జరగలేదట..
విడాకులు అనౌన్స్ చేయకముందే, చాలా రోజులుగా మీడియా ఛానెళ్లలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారంపై ఇటు చైతూ కానీ, అటు సమంత కానీ రెస్పాండ్ కాకపోవడంతో సహజంగా జరిగే ఫేక్ ప్రచారమేలే అనుకున్నారంతా.
కానీ, వన్ ఫైన్ డే.. ‘ఔను మేమిద్దం విడిపోతున్నాం’ అంటూ అనౌన్స్‌మెంట్ వచ్చింది చై, సామ్ నుంచి. దాంతో ఆ ప్రచారానికి అడ్డు కట్ట పడినా, ఈ న్యూస్ సెన్సేషనల్ అవ్వడం మాత్రం ఆగనే ఆగలేదు.
తాజాగా సమంత ఈ విడాకుల ఇష్యూపై డైరెక్ట్‌గా స్పందించింది. తామిద్దరం విడిపోవడం అనేది అంత సులువుగా జరగలేదని చెప్పిందామె.

‘ఒకవేళ మమ్మల్నిద్దరినీ ఒకే రూమ్‌లో పెట్టి బంధిస్తే, అక్కడ పదునైన ప్రమాదకరమైన ఆయుధాలేమీ వుండకుండా జాగ్రత్త తీసుకోవాలి..’ అని చెప్పింది సమంత.
Samantha Shocks Nagachaitanya.. పురుషాధిక్య సమాజానికి బుద్ధి చెప్పడానికే..
అంటే, చై, సామ్ (Chay Sam) మధ్య చాలా పెద్ద రణ రంగమే జరిగిందన్న మాట.. అని అర్ధం చేసుకోవచ్చు. చైతూతో విడిపోయిన కొన్ని రోజులకే ‘ఊ అంటావా ఊ హూ అంటావా మామా..’ సాంగ్ ఆఫర్ వచ్చిందట సమంతకు.
Also Read: సుస్మితాయణం.! పెళ్ళి కాదు, డేటింగే సుమండీ.!
ఈ పురుషాధిక్య సమాజంలో వారిలోని లోపాలను ఎత్తి చూపేందుకు ఈ పాట సరైందనీ, నాలాంటి స్టార్ సెలబ్రిటీ చెబితే, దానికి రీచ్ ఎక్కువ వుంటుందని భావించిన సమంత, వెంటనే ఓకే చెప్పేసిందట.
అనుకున్నట్లుగానే ఆ పాట సంచలనం సృష్టించింది. అందుకు చాలా చాలా హ్యాపీ ఫీలయ్యానని అంటోంది సమంత.
విడాకుల తర్వాత మరింత స్ట్రాంగ్‌గా..
చైతూతో విడిపోయిన సమయంలో చాలా మనోవేదనకు లోనయ్యిందట సమంత. కానీ, ఆ తర్వాత తనను తాను మునుపెన్నడూ లేని విధంగా ధృఢంగా మలుచుకున్నానని చెబుతోంది.
250 కోట్ల భరణం సంగతేంటీ.?
చైతూతో విడిపోయినందుకు 250 కోట్ల భరణం డిమాండ్ చేసిందని సమంతపై చెడు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
కానీ, ఆ ప్రచారంలో నిజం లేదనీ, ఆ వార్తలు చూసి ఎవరైనా ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్లు తన ఇంటిపై దాడి చేసి, అదంతా వుత్తదే అని చెబితే బావుండు.. అని సమంత చెప్పుకొచ్చింది.
చివరిగా.. జీవితంలో ఇంకెప్పుడూ ప్రేమలో పడే తప్పు మాత్రం చేయనని సమంత చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.