Samantha.. సమంత అసలు తెలుగు సినిమాలే చెయ్యదంట.. అంటూ ఓ ప్రచారం ఇటీవల ఊపందుకుంది. కానీ, సమంత మాత్రం.. తాను తెలుగు సినిమాల్లో నటించడం కొనసాగిస్తానని స్పష్టం చేసేసింది. అలాగే, బాలీవుడ్ ప్రయత్నాలు.. దాంతోపాటుగా, తమిళ సినిమాల్ని ఓకే చెయ్యడం.. వెరసి, సమంత చాలా బిజీ అయిపోయింది.
అక్కినేని నాగచైతన్యతో వైవాహిక బంధం తెగిపోయాక, సమంత గతంలో ఎన్నడూ లేనంత బిజీగా కనిపిస్తోంది. పలు కమర్షియల్ యాడ్స్‌లో కూడా సమంత బాగానే కనిపిస్తోంది. పెళ్ళయితే సినిమాలు మానెయ్యాలన్నది ఒకప్పటి మాట. విడాకులతో కథ ముగిసిపోతుందన్నదీ పాత కాలపు మాటే.
Samantha మాత్రమే కాదండోయ్..
అమలా పాల్, విడాకుల తర్వాతే స్టార్‌డమ్ అందుకుంది. చెప్పుకుంటూ పోతే ఇలాంటి లిస్ట్ పెద్దదే వుంటుంది. ఒకప్పటికీ, ఇప్పటికీ.. అందుకే చాలా తేడా. పెళ్ళి కావొచ్చు, ప్రెగ్నెన్సీ కావొచ్చు, విడాకులు కావొచ్చు.. ఇవేవీ కెరీర్‌ని ఇబ్బంది పెట్టే అంశాలు కావు.

మరి, సమంత స్పెషల్ సాంగ్స్‌కి సైతం ఓకే చెప్పేస్తుందా.? అంటే, ‘ఏం ఎందుకు ఒప్పుకోదు.?’ అనే ఎదురు ప్రశ్నసోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. అయితే, స్పెషల్ సాంగ్ కోసం సమంతకి ఏకంగా 2 కోట్లు ఇచ్చే పరిస్థితి వుంటుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
షీ ఈజ్ వెరీ స్పెషల్..
2 కోట్లు కాకపోయినా, సమంతకి రికార్డు స్థాయిలోనే స్పెషల్ సాంగ్ కోసం ముట్టజెప్పుకోవాల్సి వస్తుంది ఏ నిర్మాత అయినా.. ఆ రేంజ్ పాపులారిటీ సమంతకి వుంది మరి.
Also Read: Naga Chaitanya జ్ణాపకాల్ని Samantha చెరిపేసుకుంటోందా?
సమంత ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోన్న విషయం విదితమే. గుణశేఖర్ రూపొందిస్తున్నారు ఈ చిత్రాన్ని.