Samantha Tralala Moving Pictures.. మయోసైటిస్ అనే అనారోగ్య సమస్య కారణంగా కాస్త సినిమాల్ని తగ్గించిన సమంత, ఈసారి సరికొత్త ప్రయాణం షురూ చేసింది.
ఇప్పటిదాకా నటిగా ఎన్నో సినిమాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో సమంత తెలుగు సహా తమిళ ప్రేక్షకుల్ని సైతం అలరించిన సంగతి తెలిసిందే.
సమంత (Samantha Ruth Prabhu) స్టార్‌డమ్ బాలీవుడ్‌కి సైతం పాకింది ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ కారణంగా.
Samantha Tralala Moving Pictures.. ట్రాలాలా.. మూవింగ్ పిక్చర్స్
అసలు విషయంలోకి వస్తే, సమంత కొత్త నిర్మాణ సంస్థని ప్రారంభించింది. ఈ నిర్మాణ సంస్థ ద్వారా కంటెంట్ రిచ్ సినిమాల్ని నిర్మిస్తుందట.
నటుడు అక్కినేని నాగచైతన్యను (Akkineni Nagachaitanya) పెళ్ళాడాక, అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సినీ నిర్మాణ బాధ్యతను సమంత తీసుకుంటుందని అప్పట్లో అంతా అనుకున్నారు.

అన్నపూర్ణ స్తూడియోస్ నుంచే ఇంకో కొత్త నిర్మాణ సంస్థ సమంత కోసం పుట్టుకొస్తుందనే ప్రచారమూ జరిగింది.
అయితే, అనివార్య కారణాల వల్ల సమంత – నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సమంత, నటిగా తన కెరీర్‌లో తనదైన స్టయిల్లో సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది.
ఇక, ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థని ప్రకటించి అందరి దృష్టినీ ఆకర్షించింది. బ్యానర్ పేరేమో ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’.!
బ్యానర్ పేరు కొత్తగా వుంది కదా.! సమంత నిర్మించే సినిమాలు కూడా కొత్తగా వుండాలని ఆశిద్దాం. కేవలం సినిమాలు మాత్రమేనా.? వెబ్ సిరీస్‌లు కూడానా.? ఏమో, ముందు ముందు ఆ విషయమై స్పష్టత వస్తుంది.