Sameera Reddy Maheshbabu యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు అప్పట్లో ఆమెని ‘వదినా’ అని పిలిచేవారు.! ఏకంగా, నందమూరి సమీరా రెడ్డి.. అనేశారు కూడా.!
అది, ‘నరసింహుడు’, ‘అశోక్’ చిత్రాల సమయంలో జరిగిన వ్యవహారం.! ఇప్పటికీ కొందరు యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు ఆమెను ‘వదిన’ అనే పిలుస్తుంటారనుకోండి.. అది వేరే సంగతి.
సమీరా రెడ్డి – ఎన్టీయార్ కలిసి నటించిన సినిమాల్లో ‘అశోక్’ (Ashok) కాస్త బెటర్.! ‘నరసింహుడు’ (Narasimhudu) మాత్రం పెద్ద డిజాస్టర్.
నటన సంగతి పక్కన పెడితే, డాన్సుల్లో మాత్రం సమీరా రెడ్డి (Sameera reddy) సూపరంతే. యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో (Young Tiger NTR) కలిసి డాన్సులు అదరగొట్టేసింది.
మెగాస్టార్ చిరంజీవితో (Mega Star Chiranjeevi) ‘జై చిరంజీవ’ (Jai Chiranjeeva) సినిమాలోనూ నటించింది ఈ డస్కీ బ్యూటీ. తెలుగమ్మాయే అయినా, తెలుగు సినిమాల్లో కంటే బాలీవుడ్ సినిమాల్లోనే ఎక్కువగా నటించింది.
Sameera Reddy Maheshbabu మహేష్‌బాబుని మిస్సయ్యిందట.!
సమీరా రెడ్డి ఓ సినిమా కోసం ఆడిషన్స్‌కి వెళ్ళిందట. ఆ సినిమాలో మహేష్‌బాబు (Super Star Maheshbabu) హీరో అట. అది 1998 నాటి సంగతి. ఇంతకీ, ఏ సినిమా అది.? అది మాత్రం సమీరా చెప్పలేదు.

ఆడిషన్స్‌లో తాను ఫెయిల్ అయ్యానని మాత్రం సమీరా రెడ్డి (Sameera Reddy) చెప్పుకొచ్చింది. అక్కడ ఆడిషన్స్‌లో అడిగిన విధంగా నటించలేకపోయినందుకు బాగా ఏడ్చేసిందట సమీరారెడ్డి.
ఔనా.! నటన అస్సలు చేతకాని ఎంతోమంది హీరోయిన్లు.. స్టార్లయిపోయిన తెలుగు సినీ పరిశ్రమలో, సమీరా రెడ్డికి ‘సరిగ్గా నటించలేకపోయింది’ అని, రెడ్ సిగ్నల్ వేసిందెవరబ్బా.?
వైరల్ అవుతున్న ఫొటోలు..
అప్పటి ఆ ఆడిషన్‌కి సంబంధించిన ఫొటోల్ని సమీరా రెడ్డి (Sameera Reddy) తాజాగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. పద్ధతైన తెలుగు కట్టూబొట్టూ.. చూడ చక్కగానే వుంది ఈ ఫొటోల్లో సమీరా రెడ్డి.
Also Read: పవన్ సాక్షిగా.! బాలయ్య నోట బండ్ల మంత్రం.!
ఆడిషన్స్‌లో ఫెయిల్ అయ్యాక.. మరింత పట్టుదలతో ప్రయత్నించి, హీరోయిన్‌గా నిలదొక్కుకున్నానని సమీరా రెడ్డి తన పోస్ట్‌లో చెప్పుకొచ్చింది. అద్గదీ అసలు సంగతి.