Samyuktha Menon Akhanda.. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అఖండ-2’. ‘అఖండ’ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ‘అఖండ-2’పై అంచనాలు పెరగడం సహజమే.
ఇక, ‘అఖండ-2’ టీమ్, ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా కోసం తాజాగా నటి సంయుక్తని ఎంపిక చేయడమే ఆ అప్డేట్.
‘వెల్‌కమ్ ఆన్ బోర్డ్ సంయుక్త..’ అంటూ, ‘అఖండ-2’ బృందం, నటి సంయుక్త మీనన్‌తో కూడిన ఓ పోస్టర్‌ని విడుదల చేసింది.
తెలుగులో ఇప్పటికే సంయుక్త ‘భీమ్లానాయక్’, ‘విరూపాక్ష’, ‘బింబిసార’ తదితర సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ‘విరూపాక్ష’ సినిమాలో సంయుక్త నటనకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
తెలుగులో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా, నటిగా మంచి మార్కులే సంపాదించుకుంది సంయుక్త.
ఇదిలా వుంటే, ‘అఖండ-2’ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ వుంటుందా.? ఆమె స్థానంలోనే సంయుక్తని తీసుకొస్తున్నారా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
‘అఖండ’ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఆమె పాత్రకు కొనసాగింపు వుంటుందనీ, సంయుక్త ఓ కీ రోల్‌లో కనిపించబోతోందనీ అంటున్నారు.
పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.