Table of Contents
Samyuktha Menon.. టాలీవుడ్ తెరపై మలయాళీ ముద్దుగుమ్మలకున్నక్రేజే వేరప్పా. నార్త్ భామలెంత మంది వున్నా, తెలుగులో ఎంతమంది అందగత్తెలున్నాఎందుకో మలయాళీ భామలంటే మన తెలుగు ఫిలిం మేకర్లకు మోజెక్కువ.
అందుకే మలయాళ భామలిక్కడ.. మన తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్నారు. నిజమే, మలయాళీ భామలకు అందంతో పాటు కూసింత టాలెంట్ కూడా ఎక్కువే. అలాగని మనోళ్లేం తక్కువని కాదండోయ్. అదంతే, మలయాళీ ముద్దుగుమ్మలు రేఖేసుకుని (లక్కు తోక తొక్కేసి) వచ్చేస్తారంతే.
ఎంట్రీనే ఎంతో ఘనంగా..
సరే, ఇప్పుడీ మలయాళీ ముద్దుగుమ్మల జపం ఎందుకంటారా.? తాజాగా మరో మలయాళీ ముద్దుగుమ్మ టాలీవుడ్ దృష్టిలో పడింది మరి. పేరు సంయుక్తా మీనన్. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది మరి. ఆగండాగండి. పవన్‌తో ఈ ముద్దుగుమ్మ జోడీ కట్టడం లేదనుకోండి.

‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో (Pawan Kalyan) పాటు, రానా దగ్గుబాటి (Rana Daggubati) కూడా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ సరసన మలయాళ బొద్దుగుమ్మ నిత్యా మీనన్ (Nithya Menen) నటిస్తుండగా, రానాతో ఈ కొత్త మలయాళ కుట్టీ జత కడుతోందన్న మాట.
Samyuktha Menon.. సంయుక్త క్రేజీ ఛాన్స్ – అదుర్స్
వస్తూ వస్తూనే పాప బిగ్ ప్రాజెక్టులు టేకప్ చేసేస్తోంది. ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) తర్వాత సంయుక్తా మీనన్, తమిళ హీరో ధనుష్ (Dhanush) సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ధనుష్ సినిమా అంటే తమిళ సినిమా కదా.. అని అవాక్కవుతున్నారా.? బైలింగ్వల్ మూవీ ఇది. ధనుష్ చేస్తున్నతొలి తెలుగు స్ట్రెయిట్ మూవీ ఇది. విశేషమేగా.

వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన సూపర్ హిట్ మూవీ ‘తొలిప్రేమ’ (Toli Prema) డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ‘సర్’ అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది.
సంయుక్త – బ్యూటీ ఆఫ్ ఇన్నోసెన్స్
నేచురల్ లుక్స్‌తో చూడగానే ఎట్రాక్ట్ చేసే అందం సంయుక్త మీనన్. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిందిదే. సక్సెస్ వచ్చిందా.. ఇక అంతే టాలీవుడ్ నెత్తిన పెట్టేసుకుంటుంది.
Also Read: హీరోయిన్లకేనా ఆ క్వశ్చన్.! హీరోలకైతే అక్కర్లేదా.?

మలయాళ సినిమాలతో బిజీగా వుంటూనే సంయుక్తా మీనన్ కొన్ని తమిళ సినిమాల్లోనూ నటించింది. కెరీర్ మొదట్లో ఓ పాపులర్ మలయాళ వెబ్ సిరీస్‌లోనూ నటించి శభాష్ అనిపించుకుంది. ఈ బ్యూటీ తెలుగు తెరపై ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువవుతుందో వేచి చూడాలిక.!