Samyuktha Menon Virupaksha.. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘విరూపాక్ష’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
అయితే, చిత్ర నిర్మాణ సంస్థపై సంయుక్త మీనన్ (Samyuktha Menon) అసహనం వ్యక్తం చేస్తూ ఓ ట్వీటేసింది.
నటిగా తొలి సినిమాతోనే తనదైన ప్రత్యేకతను చాటుకుంది..
తొలి తెలుగు సినిమా విడుదల కాకుండానే, చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు సంపాదించుకుంది..
పైగా, గలగలా తెలుగులో మాట్లాడేస్తూ.. అందరి దృష్టినీ ఆకర్షించింది..
అమ్మా.. నాన్నా.. విడాకులు తీసుకున్నారు.. సో, ‘మీనన్’ అనే పేరు నాకు అవసరం లేదు.. అని కూడా చెప్పేసింది..
‘విరూపాక్ష’ సినిమా ప్రమోషన్లలో తనకు జరుగుతున్న అన్యాయంపై గట్టిగా నిలదీసింది..
సంయుక్త మీనన్.. ఆషామాషీ హీరోయిన్ కాదు.. కాస్త రెబల్ టైప్ అన్నమాట.!
కానీ, సంయుక్తకి అన్యాయం జరుగుతోంటే, హీరో సాయి ధరమ్ తేజ్ ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదబ్బా.?
Mudra369
ఉగాది సందర్భంగా తనకు సంబంధించి ఓ పోస్టర్ విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ చెప్పినప్పటికీ, అలా జరగలేదన్నది ఆమె ఆవేదనకి కారణం.
Samyuktha Menon Virupaksha హీరో పోస్టర్ మాత్రమే ఎందుకు.?
ఉగాది నేపథ్యంలో ‘విరూపాక్ష’ (Virupaksha) టీమ్ ఓ పోస్టర్ విడుదల చేసింది. అందులో హీరో మాత్రమే కనిపిస్తున్నాడు. హీరోయిన్ జాడ లేకుండా పోయింది.
రోడ్డు ప్రమాదానికి గురై, చాలా రోజులపాటు కోలుకునేందుకు సమయం తీసుకున్న సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నుంచి వస్తోన్న సినిమా ‘విరూపాక్ష’.

ప్రోమోస్ ఇంట్రెస్టింగ్‌గానే వున్నాయ్. అయినాగానీ, సినిమాపై బజ్ అంతగా క్రియేట్ అవడంలేదు. ఇంతలోనే, ఈ వివాదం తెరపైకొచ్చింది.
Also Read: Mrunal Thakur.! వెండితెర ‘సీత’.. గీత దాటితే.!
ఇంతకీ తప్పెవరిది.? ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుంది.? అన్నట్టు సంయుక్త మీనన్ తెలుగులో ‘భీమ్లానాయక్’, ‘బింబిసార’ తదితర సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.
కాగా, ట్విట్టర్ వేదికగా సంయుక్త (Samyuktha Menon) వ్యక్తం చేసిన ఆవేదనపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. సంయుక్తకి క్షమాపణ చెబుతూ, సమస్యను పరిష్కరిస్తామంటూ ట్వీటేసింది.
‘ఓకే’ అంటూ సంయుక్త (Samyuktha Menon) ముక్తసరిగా చిత్ర నిర్మాణ సంస్థకు ట్విట్టర్ వేదికగా రిప్లయ్ ఇవ్వడం కొసమెరుపు.