Sankranti Alludu.. అల్లుడుగారొచ్చారట.! మర్యాదలు చేయొద్దూ.! ఓ పది వంటకాలే ఎక్కువ మామూలుగా అయితే. కానీ, పాతిక వంటకాలు.. అబ్బే, అవీ చాలవు.. ఓ వంద వంటకాలు.. అవి కూడా తక్కువే.!
లెక్కెట్టుకుని మరీ 379 రకాల వంటకాల్ని సిద్ధం చేసిందట ఓ కుటుంబం.. తమ ఇంటికి వచ్చిన ‘పండగ అల్లుడు’ కోసం.!
ఇన్ని రకాల వంటకాల్ని తన ముందుంచకపోతే, ‘నీ కూతుర్ని ఏలుకోను’ అని ఏ అల్లుడైనా షరతులు పెడతాడా.?
Mudra369
పండగకేముంది.? ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. సరే, కొత్తల్లుడు.. సంక్రాంతి పండగ.. మర్యాదలు చేయడాన్ని తప్పు పట్టలేం.
Sankranti Alludu తిండిలేక ఎందరో.. తిండి ఎక్కువైపోయి కొందరు..
కానీ, పది మంది దృష్టిలో పడాలని, పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో వంటకాలు సిద్ధం చేస్తేనే.. వినేవారికి ఒళ్ళు మండిపోతుంది.
ప్రపంచంలో చాలామంది పూట గడవని స్థితిలో వున్నారు. ప్రపంచందాకా ఎందుకు.? మన చుట్టూ వున్నవారిలో ఎంతమంది తిండి లేక అవస్తలు పడుతున్నారు.?
అలాగని, అందరికీ సాయం చేయాలని కాదుగానీ.. మనం వృధా చేయకపోతే, అదే గొప్ప విషయం.! మనిషన్నోడెవడైనా 379 రకాల వంటకాల్ని ఒకేసారి రుచిచూడగలడా.?
పెళ్ళాన్ని ఏలుకోనన్నాడా.?
బొత్తిగా ఇంగితం లేకుండా పోతోంది మనుషులకి. ఎవడో ఎక్కడో మొదలెడతాడు.. ఆ పిచ్చి అందరికీ పాకేస్తుంది.!
గోదారోళ్ళ మర్యాదలు చాలా ఎక్కువ.! ఉత్తరాంధ్ర మర్యాదలు తెలియనిదెవరికి.? రాయలసీమలో మర్యాదలు మామూలుగా వుండవ్. కృష్ణ, గుంటూరోళ్ళు ఏమన్నా తక్కువా.? ఆ మాటకొస్తే, తెలంగాణ సమాజం కూడా అంతే.
Also Read: సంక్రాంతి సెంచరీ.! విరాట్ కోహ్లీ నాలుగోస్సారి.!
ఎక్కడైనా ‘మర్యాదలు’ తప్పవు. కాస్త ఎక్కువ, కాస్త తక్కువ.. అంతే.! ఇన్ని రకాల వంటకాల్ని తన ముందుంచకపోతే, ‘నీ కూతుర్ని ఏలుకోను’ అని ఏ అల్లుడైనా షరతులు పెడతాడా.?
అన్నట్టు.. మొహమాటపడే అల్లుడైతే.. పెట్టిన ఆ వందల వంటకాలూ తినేసి.. పుటుక్కుమంటే ఎవరిది రెస్పాన్సిబులిటీ.? మా మర్యాదలే ఇంత.! వచ్చినోడు చచ్చినాసరే.. అంటారా.? అనుకోండి.. మీ ఇష్టం.
– yeSBee