Table of Contents
Sarkaru Vaari Paata.. సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమాకీ నెగెటివ్ సెంటిమెంట్ వుందా.? వుంటే, అదేంటి.?
సినిమాకీ, సెంటిమెంటుకీ వున్న లింకు అలాంటిలాంటిది కాదు. రాజమౌళి సినిమాలో నటించే హీరో తదుపరి సినిమా గట్టెక్కడం కష్టమే.! ఈ సెంటిమెంట్ చాలామంది హీరోల విషయంలో ప్రూవ్ అయ్యింది.
‘ఆచార్య’ సినిమాకీ ఇదే సెంటిమెంట్ నిజమయ్యిందని సినిమా విడుదలకు ముందే ప్రచారం జరిగినా, దాన్ని చిరంజీవి కొట్టి పారేశారు. కానీ, ‘ఆచార్య’ సినిమా ఫలితం ఏమయ్యిందో అందరికీ తెలిసిందే కదా.!
Sarkaru Vaari Paata.. ఈ డైలాగుల గోలేంటి.?
ఇక, ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ విషయానికొద్దాం. సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది.. సినిమాపై అంచనాల్ని పదింతలు పెంచేసింది.
ట్రైలర్‌లో కొన్ని అభ్యంతరకర డైలాగులు వున్నా, అవి సినిమాకి అవసరమని దర్శకుడు చెబుతున్నాడనుకోండి.. అది వేరే సంగతి.
‘ఆ డైలాగులు చెప్పడానికి మహేష్ ఒప్పుకోలేదు.. కానీ, ఒప్పించాం..’ అని దర్శకుడు పరశురామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనంగా మారింది.
కీర్తి సురేష్ నెగెటివ్ సెంటిమెంట్.?
తొలిసారిగా ఈ సినిమా కోసం మహేష్‌బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది కీర్తి సురేష్ (Keerthy Suresh).
‘మహానటి’గా తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, తమిళ సినీ పరిశ్రమలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్న కీర్తి, మహేష్‌తో కెమిస్ట్రీని బాగా పండించిందని అర్థమవుతోంది ‘సర్కారు వారి పాట’ ట్రరైలర్ చూస్తోంటే.

అయితే, ఈ సినిమాకి మేజర్ నెగెటివ్ సెంటిమెంట్ ఇంకెవరో కాదు, కీర్తి సురేష్ (Keerthy Suresh) అంటున్నారు చాలామంది.
గత కొద్ది కాలంగా కీర్తి సురేష్ సరైన హిట్టు కొట్టింది లేదు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో కెరీర్‌లో కీర్తి సురేష్ బాగా డీలా పడిపోయింది.
సో, ‘సర్కారు వారి పాట’ సినిమా మీద కీర్తి సురేష్ నెగెటివ్ సెంటిమెంట్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందోనన్న ఆందోళన మహేష్ (Super Star Maheshbabu) అభిమానుల్లో కలగడం సహజమే కదా.
గట్టిగానే కొట్టబోతున్నామంటున్న మహేష్ అభిమానులు..
కానీ, కొందరు మహేష్ అభిమానులు మాత్రం, ‘మహానటి’తో తెచ్చుకున్న గుర్తింపు కంటే ఎక్కువ గుర్తింపు కీర్తి సురేష్‌కి ‘సర్కారు వారి పాట’తో వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: యంగ్ టైగర్ ఎన్టీయార్.! ఆ గండమెలా గట్టెక్కుతావ్.!
చూద్దాం.. కమర్షియల్ హీరోయిన్‌గా కీర్తి సురేష్ ఈ సినిమాతో సరికొత్త ఇమేజ్ దక్కించుకుంటుందో.? లేదంటే, ‘సర్కారు వారి పాట’కి నెగెటివ్ సెంటిమెంట్ అవుతుందో.!