వెండితెరపై బాక్సింగ్ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. తమిళ నటుడూ, తెలుగు వారికీ సుపరిచితుడైన నటుడు ఆర్య నటించిన ‘సార్పట్ట’ (Sarpatta Review In Telugu Mudra369) సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలే నెలకొన్నాయి. దానికి కారణం ఆర్య కండలు తిరిగే శరీరంతో బాకింగ్ గ్లౌస్ ధరించి, రెట్రో లుక్‌తో కనిపించడమే.
సినిమా కోసం ఆర్య చాలా కష్టపడ్డాడు. నో డౌట్. ఈ సినిమాకి ఆర్య మాత్రమే మేజర్ ఎట్రాక్షన్. రెట్రో థీమ్ బాక్సింగ్ నేపథ్యం సినిమాపై అంచనాల్ని పెంచింది. అందుకు తగ్గట్లే ప్రమోషన్లు కూడా జరిగాయి. కానీ, సినిమా దగ్గరకొచ్చేసరికి, లెంగ్త్ చాలా పెద్ద మైనస్ అయిపోయింది. తెరపై ఆర్య కనిపించిన ప్రతీసారీ ఆర్య కష్టం కనిపిస్తుంది. అయితే, ఆ కష్టాన్ని సైతం సాగతీత నీరు కార్చేసింది.
కథలోకి వెళితే, బ్రిటీష్ హయాంలో కొందరు భారతీయులు బాక్సింగ్ నేర్చుకుంటారు. దాన్ని కొందరు ఓ పరంపరగా మార్చేసుకుంటారు. రెండు గ్రూపుల మధ్య ఈ పరంపర కోసం పోటీ జరుగుతుంది. ఇందులో ఓ గ్రూపు సార్పట్ట.
సార్పట్ట ప్రాభవం కోల్పోతోందన్న తరుణంలో ప్రత్యర్థి వర్గం బాక్సర్ వేటపులిని సవాల్ చేస్తాడు ‘సార్పట్ట’ ప్రధాన కోచ్. అప్పటి దాకా బాక్సింగ్ చూడడమే తప్ప, ఎప్పుడూ బాక్సింగ్ చేయని సమర (ఆర్య), వేట పులి (జాన్ కొక్కెన్)తో తలపడాల్సి వస్తుంది.
ఈ క్రమంలో సమరకు రకరకాల సమస్యలు ఎధురవుతాయి. అయినా వేటపులిని మట్టి కరిపిస్తాడు. అయితే, ఆ మ్యాచ్ రద్దవుతుంది. అధికారికంగా సార్పట్ట విజయం సాధించడానికి ఆస్కారం లేకుండా పోతుంది. అనుకోని పరిస్థితుల నేపథ్యంలో సమర బాక్సింగ్‌కి దూరమవుతాడు. వ్యసనాలకు బానిసవుతాడు. మరి సార్పట్ట పరిస్థితేంటీ.? వేటపులిని ఓడించి సార్పట్ట పరంపరను నిలబెట్టిందెవరు.? ఇదే మిగతా కథ.
సాధారణంగా బాక్సింగ్ నేపథ్యంలో సినిమా అంటే, కళ్లు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ ఉండాలి. కానీ, ‘సార్పట్ట’లో ఒకే ఒక్క ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ‘రోజ్’ అనే బాక్సర్. ‘సార్పట్ట’ ప్రత్యర్థి వర్గంలో ఉండే రోజ్, ఓ యాక్షన్ బ్లాక్ చాలా బాగా చేశాడు. అంతకు మించి, ‘సార్పట్ట’ నుండి ఆశించడానికి ఏమీ లేదు.
ఇందిరాగాంధీ హయాంలో విధింపబడిన ఎమర్జెన్సీని ఈ సినిమా కోసం ఎందుకు వాడారో కానీ, దాని వల్ల సినిమాకి నష్టమే జరిగింది. గంటన్నర సినిమా వరకూ లేపేయొచ్చు అనేంతలా సాగతీత జరిగింది.
సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నా, సాగతీత ముందు, అన్ని ప్లస్సులూ, గల్లంతయ్యాయి. ఆర్య తన పాత్ర కోసం పూర్తి డెడికేషన్ చూపించాడు. కానీ, సాగతీత గురించి కొంచెమైనా అప్రమత్తమై ఉండాల్సింది.
ఆర్య డెడికేషన్ వృధా అయ్యిందన్న భావన సినిమా చూసిన ప్రతీ ఒక్కరిలోనూ కలుగుతుంది. కోచ్ పాత్రలో నటించిన పశుపతి సహా ఎవ్వరూ ఆకట్టుకోలేకెపోయారు. హీరోయిన్ ఈ సినిమాకి దండగ. అతి విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఆర్యతో (Sarpatta Review In Telugu Mudra369) సహా.