Dubai Gold District Walkway.. బంగారం ధర ఎప్పుడో కొండెక్కేసింది.! గ్రాము బంగారం కొనాలంటేనే, ‘అమ్మో..’ అని భయపడుతున్న రోజులివి.!
అలాంటిది, అదే బంగారాన్ని కాళ్ళ కింద తొక్కుకుంటూ, నడిచి వెళ్ళడమా.? అదసలు సాధ్యమేనా.? అంటే, ఆ ‘బంగారు’ అనుభూతి నిజ్జంగానే నిజం అని చెప్పక తప్పదు.
గల్ఫ్ దేశాల్లో బంగారం ధర, మనకంటే చాలా తక్కువ.. అన్న విషయం చాలామందికి తెలిసిన విషయమే.
ఎంత తక్కువైతే మాత్రం, మరీ.. కాళ్ళ కింద బంగారాన్ని తొక్కుకుంటూ వెళ్ళేంత చీప్ అయిపోయిందా.? అన్న డౌట్ మీకొస్తే, అది మీ తప్పు కానే కాదు.!
Dubai Gold District Walkway.. బంగారంతో రూపొందించిన నడకదారి..
విషయమేంటంటే, దుబాయ్‌లో ‘గోల్డ్ డిస్ట్రిక్ట్’ అని ఓ ప్రాంతముంది.! భాగ్యనగరంలో.. అదేనండీ, మన హైద్రాబాద్‌లో ‘కోఠీ’ మార్కెట్ తరహాలో అన్నమాట.
కాకపోతే, దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ అనేది, బంగారు దుకాణాల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ ప్రాంతం. అటు వైపుగా వెళితే, మైండ్ బ్లాంక్ అయిపోతుంది.
రికార్డుల కోసం తయారు చేసిన బంగారు తొడుగులు.. మనిషి నిలువెత్తున కనిపించే బంగారు జుంకాలు (మహిలలు చెవులకి పెట్టుకునేవి) కనిపిస్తాయి.
తెలుసు కదా, దుబాయ్ అంటే షాపింగ్‌కి కేరాఫ్ అడ్రస్ అని. ఒకప్పుడు దుబాయ్‌లో గోల్డ్ రేట్లు చాలా తక్కువగా వుండేవి మనతో పోల్చితే. ఇప్పుడూ తక్కువే అయినా, మరీ అంత తక్కువేమీ కాదు.
అసలేంటీ బంగారు నడకదారి.?
పైగా, భారత దేశానికి గోల్డ్ అక్కడి నుంచి తీసుకురావాలంటే, బోల్డన్ని ఆంక్షలున్నాయి. అయినాసరే, అక్కడి నుంచి బంగారాన్ని కొనుగోలు చేసి తెస్తుంటారు చాలామంది బంగారు ప్రియులు.
అసలు విషయానికొస్తే, షాపింగ్ ప్రియులకు అద్భుతమైన అనుభూతినిచ్చేందుకు దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ నిర్వాహకులు, ‘గోల్డెన్ రోడ్’ డిజైన్ చేశారు.
Also Read: ‘బ్రా’బోయ్.! ధర నాలుగు వందల డెబ్భయ్ నాలుగు కోట్లు అంటోయ్.!
ఆ రోడ్డు మీద మనం నడుచుకుంటూ వెళ్ళవచ్చు. అంటే, బంగారాన్ని తొక్కుకుంటూ వెళ్ళవచ్చన్నమాట. పూర్తిగా బంగారంతోనే, ఆ రోడ్డుని నిర్మిస్తున్నారా.? అంటే, పూర్తిగా బంగారం కాదు లెండి.!
సాధారణ రోడ్డు మీదనే, బంగారు మూలకాలతో డిజైన్ చేస్తారు. దాని మీద టఫ్ గ్లాస్ వుంటుంది.. ఆ గ్లాస్ మీదనే నడుస్తూ, మన కాళ్ళ కింద వున్న గోల్డ్ డిజైన్లను చూస్తూ మురిసిపోవాలన్నమాట.
ఎంత మొత్తంలో ఈ రోడ్డు కోసం గోల్డ్ వినియోగిస్తున్నారన్నదానిపై స్పష్టత లేదు. డిసెంబర్‌లో ఈ గోల్డెన్ రోడ్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
షాపింగ్ ప్రియులకి, పర్యాటకులకి దుబాయ్‌లో ఎన్నో అద్భుతాలున్నాయ్. వాటన్నిటికీ మించిన అద్భుతంగా ఈ దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్.. గోల్డ్ రోడ్ మారబోతోంది.