Shaitan Mahi V Raghav.. ఏమొచ్చింది.? మహి.వి.రాఘవకి. సెన్సిబుల్ సినిమాలు తీస్తాడన్న గుర్తింపు సంపాదించుకున్న మహి.వి.రాఘవ.. సెన్స్‌లెస్ సినిమా ఎందుకు తీశాడు.?
క్షమించాలి.! సినిమా కాదు వెబ్ సిరీస్. ఏదైతేనేం.! ఈ రోజుల్లో దానీకీ దీనికీ పెద్దగా తేడా ఏమీ లేదు. సినిమాలు ఓటీటీల్లో వచ్చేస్తున్నాయ్.
ఓటీటీ కంటెంట్ సినిమా ధియేటర్లలో చూసే రోజులు కూడా వస్తాయేయో. కష్టమేలెండి. అంత సేపు ధియేటర్లలో కొన్ని ఛండాలాల్ని చూడలేం.!
ముల్లు గుచ్చుకోవడమేంట్రా.? ముదనష్టపునాయలా.! అని మహి.వి.రాఘవని తిట్టిపోస్తున్నారు. ఈ సత్కారం ఆయనకి ‘సైతాన్’ వెబ్ సిరీస్ ద్వారా లభిస్తోంది.
Shaitan Mahi V Raghav.. అసలైన సైతాన్ నువ్వే.!
వెబ్ సిరీస్ అంటే, ఏ దరిద్రాన్నయినా ఎలాగైనా, చూపించేయొచ్చు. ఇదీ కక్కుర్తి బ్యాచ్ ఆలోచన. ఆ కక్కుర్తి బ్యాచ్‌లో సెన్సిబుల్ డైరెక్టర్ మహి.వి.రాఘవ.. సెన్స్‌లెస్‌గా చేరిపోయాడు.
సిగ్గు లేకుండా అని కూడా అనొచ్చు. అంతే మరి.! మామూలుగా అయితే, ఇలాంటి హెడ్డింగ్ పెట్టి.. ఇలాంటి తిట్లతో రాయాల్సి రావడం కొంత ఇబ్బందికరమే.

కానీ, తప్పట్లేదు.! ఓటీటీకి లేని సెన్సార్.. వెబ్ మీడియాకి మాత్రం ఎందుకు.? మొ.., దెం.. ఇలాంటి షార్ట్ కట్స్ రాయాల్సి వస్తుందంటే.. సంస్కారం వుండబట్టే.!
సంస్కారం మర్చిపోయాడు కాబట్టే.. మహి.వి.రాఘవ ‘సైతాన్’ వెబ్ సిరీస్‌లో విచ్చలవిడిగా బూతులు వాడేశాడు. మహిళా పాత్రధారులతో బూతులు చెప్పించడం అంటే, అస్సలు క్షమార్హం కాదు.
బూతులేనా మహి వి రాఘవ భవిష్యత్తు.?
మేల్ ఆర్టిస్టుల విషయంలో అయినా ఇది సమంజసం కాదు. పోనీ వాడక తప్పని పరిస్థితి, అంత బలమైన సన్నివేశం ‘సైతాన్’ వెబ్ సిరీస్ మొత్తంలో ఒక్క చోటైనా వుందా.? అంటే అదీ లేదు.
అసలు ఏ పాత్ర ఏం చేస్తుందో అర్ధం కాదు. ఇదొక దిక్కు మాలిన వెబ్ సిరీస్. తన పైశాచికత్వాన్ని ప్రదర్శించడానికి మహి.వి.రాఘవ ఈ జుగుప్సాకరమైన వెబ్ సిరీస్ తీసినట్లున్నాడు.
Also Read: Rakesh Master.! అదే చంపేసింది.!
శిఖరమంత ఎత్తుకు ఎదగాలంటే చాలా చాలా కష్టపడాలి. పాతాళానికి పడిపోవడం పెద్ద కష్టమేమీ కాదు. మహి.వి.రాఘవ పాతాళానికి పడిపోయాడు.
శోభనం రోజు రాత్రి.. మొగుడి మీదకెక్కి.. ‘ముల్లు గుచ్చుకోవట్లేదు’ అంటుంది.. దేవియాని శర్మ.! ‘సైతాన్’ వెబ్ సిరీస్‌లో బూతు పైశాచికత్వానికి ఇదొక పరాకాష్ట.
కాదు, కాదు.. ఈ ముదనష్టపు వెబ్ సిరీస్‌తో దిగజారిపోయాడు. అయినా ‘ముల్లు గుచ్చుకోవడమేంట్రా.! ముదనష్టపునాయలా.! మీ ఇంట్లో వాళ్లకి చెప్పి చూడు..! ఏమంటారో.!