Shamna Khasim అలియాస్ Purna.! అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో పాపులర్ అయ్యింది ఈ బొద్దుగుమ్మ.!
ఆమె మంచి డాన్సర్.! అది అందరికీ తెలిసిన విషయమే. బుల్లితెరపైనా పలు ఈవెంట్స్‌లో కనిపిస్తుంటుంది.. ఓ డాన్స్ షోకి జడ్జిగా కూడా వ్యవహరించింది.
తెలుగు మాత్రమే కాదు, తమిళ సినిమాలతోపాటు మలయాళ, కన్నడ సినిమాల్లోనూ పూర్ణ అలియాస్ షామ్నా ఖాసిమ్ నటించింది.
Shamna Khasim Purnaa పెళ్ళయిపోయిందోచ్.!
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి ఒకింత ఆసక్తి వుండడం ఎవరికైనా మామూలే. ఫలానా హీరోతో డేటింగ్ అట.. అంటూ రూమర్లయితే హీరోయిన్లకి సర్వసాధారణం.

అలాంటి రూమర్లను చాలానే చవిచూసేసింది పూర్ణ. కొన్నాళ్ళ క్రితం తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని పూర్ణ వెల్లడించింది. ఆ తర్వాత ‘ఆల్రెడీ పెళ్ళయిపోయింది..’ అనే ఊహాగానాలు మళ్ళీ మామూలే.
కానీ, తాజాగా అక్టోబర్ 24న తన పెళ్ళి జరిగిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో, ఆ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోల్ని పూర్ణ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వాట్ నెక్స్‌ట్.?
పెళ్ళయ్యింది సరే, తర్వాతేంటి.? నిశ్చితార్థం గురించి ప్రకటించాక, బ్రేకప్ గాసిప్స్‌ని కూడా వినాల్సి వచ్చింది పూర్ణ. మరిప్పుడెలాంటి గాసిప్స్‌ని ఆమె వినాల్సి వస్తుందో.!
Also Read: Avantika Dassani.. ‘ప్రేమ పావురం’ నట వారసత్వం.!
నయనతార తరహాలో ఆల్రెడీ పూర్ణ, సరోగసీని ఆశ్రయిస్తుందా.? లేదంటే, సహజ పద్ధతుల్లోనే పిల్లల్ని కంటుందా.? ఇవేవీ కాదు, భర్తతో ఎక్కువ రోజులు సంసారం చెయ్యలేక విడాకులు తీసుకుంటుందా.? ఇలా తయారైంది గాసిప్స్ మేళం తీరు.!