Shane Warne Heart Attack: క్రికెట్ దిగ్గజం.. అనదగ్గ లిస్టులో అతని పేరూ వుంటుంది. ఆయన స్పిన్ దిగ్గజం.! ఔను, మైదానంలోకి బంతితో దిగాడంటే, ఆ బంతిని ఎలా తిప్పుతాడో అంచనా వేయడం ఏ దిగ్గజ బ్యాట్స్‌మెన్‌కి అయినా కష్టమే.
ఔను, అతనే లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ (Shane Warne). ఆస్ట్రేలియన్ గనుక, టీమిండియాకి దాయిది లాంటి జట్టు ఆస్ట్రేలియా కాబట్టి.. షేన్ వార్న్ ఘనతని తక్కువగా చూడలేం.
అందుకేనేమో, మన బారత లెజెండరీ క్రికెటర్ ఎవరైనా హఠాన్మరణం చెందితే ఎలా విలవిల్లాడిపోతామో, షేన్ వార్న్ మరణ వార్త విన్నాక అంతలా భారత క్రికెట్ అభిమానులు ఆవేదన చెందారు.
Shane Warne Heart Attack.. ఆ అనుమానాల్లేవ్.!
షేన్ వార్న్ మరణం వెనుక అనుమానాలున్నాయన్న ప్రచారం జరిగింది. తొలుత గుండెపోటుతో చనిపోయినట్లు పోలీసులు ధృవీకరించారు. అంతలోనే, ఆయన నివాసంలో రక్తపు మరకలు కనిపించాయన్న ప్రచారం తెరపైకొచ్చింది.

అయితే, చివరికి అది అనుమానాస్పద మరణమేమీ కాదు, సహజ మరణమే.. ఆకస్మిక గుండెపోటు వల్ల సంభవించిన మరణమే.. అని వైద్యులు, పోలీసులు స్పష్టం చేసేశారు.
అదేంటో, ఈ మధ్య ఎక్కడ ఎవరు గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందారన్న వార్త బయటకు వచ్చినా, అది గుండె పోటేనా.? ఇంకేదన్నా ‘పోటు’ పడిందా.? అన్న అనుమానాలు చాలామందిలో కలుగుతున్నాయి.
ఎందుకంటే, ఏ పోటుని అయినా, గుండెపోటుగా మార్చి చూపించే రాజకీయ పార్టీలు, నాయకులు, మీడియా అలా ‘పైత్యం’ ప్రదర్శిస్తున్న రోజులివి.
ఎవరి గోల వారిదే.!
ఆ సంగతి పక్కన పెడితే షేన్ వార్న్‌ని లెజెండరీ స్పిన్నర్ అనలేమంటాడొకాయన. ఇదొక సిల్లీ డిస్కషన్. షేన్ వార్న్ మరణం తర్వాత ఆయన లెజెండరీ స్పిన్నరా.? కాదా.? అన్న చర్చ జరగడంలో అర్థమే లేదు. అది అసలు అవసరం కాదు కూడా.
ఇక, షేన్ వార్న్ అధికంగా వర్కవుట్లు చేయడమే ఆయన ఆకస్మిక మరణానికి కారణమై వుండొచ్చని ఇంకొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పెద్దాయనా.! అట్టా ఎట్టా సచ్చిపోయినవ్.!
తక్కువ సమయంలో బరువు తగ్గించుకునేందుకు షేన్ వార్న్ (Shane Warne Heart Attack) కఠినమైన డైట్ అమలు చేయడం కూడా ఇలాంటి మరణానికి కారణమన్న వాదనలూ లేకపోలేదు.
ఎవరి గోల వారిది.! షేన్ వార్న్ (Shane Warne) ఆకస్మిక మరణం అత్యంత బాధాకరం.