Sharwanand Marriage.. సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలంటే జనాలకుండే ఆసక్తి వేరే లేవల్.! అందుకే, వున్నదీ లేనిదీ పోగేసి గాసిప్స్‌ని సృష్టించడం సర్వసాధారణం.!
ప్రముఖ సినీ నటుడు శర్వానంద్ పెళ్ళంట.! మీకు తెలుసా.? దీన్ని ఎక్స్‌క్లూజివ్.. అంటూ కొందరు జబ్బలు చర్చుకుంటున్నారు.
ఇది ఇంటర్నెట్ యుగం.. ఇది సోషల్ మీడియా యుగం. గత కొన్ని రోజులుగా శర్వానంద్ పెళ్ళిపై సోషల్ మీడియాలో ఈ విషయం హల్‌చల్ చేస్తూనే వుంది.
Sharwanand Marriage ఎన్నారై సంబంధం..
ఎన్నారై సంబంధం చేసుకుంటున్నాడట శర్వానంద్. అచ్చం ఇలాగే సోషల్ మీడియాలో ఓ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. కొన్ని నెలలయ్యింది.. ఈ విషయం వెలుగు చూసి.
చాలామంది చదివారు, లైట్ తీసుకున్నారు. అదిప్పుడు వార్తగా మారింది. ఇక్కడ ఎక్స్‌క్లూజివ్’ ఏముంది.? పైగా, ‘నా వార్తని కాపీ కొట్టేశావ్..’ అంటూ వెబ్ మీడియాలో ఒకర్ని ఒకరు దూషించుకునే స్థితికి వెళ్ళింది పరిస్థితి.
ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి.. అంటారే, సెలబ్రిటీల పెళ్ళికి.. వెబ్ మీడియా హడావిడి అలాంటిదన్నమాట.
అసలు కథ ఇప్పుడే మొదలైంది..
శర్వానంద్‌ని పెళ్ళాడబోయే అమ్మాయి ఏం చేస్తుందో తెలిస్తే షాకవుతారు.. అంటూ కథనాలు పుట్టుకొస్తాయ్.! అంతేనా, ఆమెకు వున్న ఆస్తుల లెక్కల పేరుతోనూ షాకింగ్ గాసిప్స్ తీసుకొస్తారు.
Also Read: Malaika Arora: అందరూ వెతికేది అందుకే.!
పిచ్చి పీక్స్‌కి వెళ్ళడమంటే ఇదే మరి.! టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ విషయానికొస్తే, శర్వానంద్ పేరు కూడా వినిపిస్తుంటుంది.
శర్వానంద్ ఓ ఇంటివాడవుతున్నాడు. జస్ట్ ఇదొక మామూలు వార్త. అభిమానులకి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్.!