Shilpa Shetty Kundra Not Happy With Publicity.. రోజులు మారాయ్.. ఒకప్పుడు పబ్లిసిటీ కోసం రకరకాల స్టంట్లు చేసిన నటి శిల్పా శెట్టి, ఇప్పుడు పబ్లిసిటీ వద్దు మొర్రో.. అంటూ బతిమాలుకుంటోంది. తనకు, తన కుటుంబ సభ్యులకూ ప్రైవసీ కావాలని కోరుతోంది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ నోట్ విడుదల చేసింది కూడా.
నిజమే, నటి అయినంతమాత్రాన శిల్పా శెట్టికి ప్రైవసీ వుండకూడదా.? వుండాలి. ఆమె ప్రైవసీ కోరుకోవడంలో తప్పే లేదు. పైగా, శిల్పా శెట్టి పిల్లలు ఈ వార్తలతో ఎంతగా ఇబ్బంది పడతారు.?
Also Read: ఓ రష్మిక.. ఓ త్రిష.. ఓ మెహ్రీన్.. అంతే కదా.! తప్పేముంది.?
కానీ, మేటర్ ఇక్కడ చాలా సీరియస్. ఔను, శిల్పా శెట్టి (Shilpa Shetty) భర్త రాజ్ కుంద్రాని పోలీసులు అరెస్ట్ చేశారు.. అదీ, అశ్లీల వీడియోలు తీస్తున్నాడనే అభియోగాల మేరకు. వందకు పైగా అశ్లీల వీడియోల కోసం పెద్ద మొత్తంలో రాజ్ కుంద్రా కొందరితో ఒప్పందాలు కూడా చేసేసుకున్నాడని పోలీసులు నిగ్గు తేల్చారు.
రాజ్ కుంద్రా (Raj Kundra) నడిపింది అశ్లీల రాకెట్.. అని పోలీసులే స్వయంగా చెబుతున్నాక, ‘నిజాలు నిగ్గు తేలేవరకూ సంయమనం పాటించండి..’ అని మీడియా మీద గుస్సా అవడం, సోషల్ మీడియాపై అసహనం వ్యక్తం చేయడం.. వీటి ద్వారా శిల్పా శెట్టి సాధించేదేముంటుంది.?
Also Read: అందం వెనుక ఆవేదన: అనుపమకి ఏమైంది.?
శిల్పా శెట్టి ఫలానా సినిమాలో నటిస్తోందంటే.. అదో పెద్ద సంచలనం.. శిల్పా శెట్టి, ఓ డాన్స్ మూమెంట్ ఏదన్నా వేదిక మీద చేసిందంటే అదో సంచలనం.. ఔను, ఆమె ఏం చేసినా సంచలనమే. అలాంటి శిల్పా శెట్టి భర్త, ఏకంగా అశ్లీల వీడియోల రాకెట్ సూత్రధారి అని పోలీసులు తేల్చాక.. విపరీతమైన హైప్‌తో కూడిన పబ్లిసిటీ రాకుండా ఎలా వుంటుంది.? ‘వద్దు మొర్రో..’ అని శిల్పా శెట్టి (Shilpa Shetty Kundra) వేడుకున్నా ఆగదిది.
అన్నట్టు, శిల్పా శెట్టి.. ఆయా మీడియా సంస్థల తీరుపై కోర్టుకెక్కితే.. ఆమెకు చుక్కెదురయ్యింది.. విషయం బహిర్గతమయ్యాక.. సీక్రెసీ ఏముంటుంది.? పరువు నష్టం.. అన్న చర్చ ఎందుకు వస్తుందని న్యాయస్థానం శిల్పా శెట్టని ప్రశ్నించడం గమనార్హం.
Also Read: మాల్దీవుల్లో అందాల మంట పెట్టేస్తున్నారహో