Shraddha Das Telugu Love.. శ్రద్ధా దాస్ తెలుసు కదా.? అదేనండీ, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘ఆర్య-2’ సినిమాలో నటించింది కదా.? ఆ బ్యూటీనే.
అంతకన్నా ముందు, అల్లరి నరేష్ హీరోగా ఓ సినిమాలో నటించింది. ఇప్పటికీ అడపా దడపా తెలుగు తెరపై కనిపిస్తూనే వుంది శ్రద్ధా దాస్.
మొన్నీమధ్యనే, ఓ హిందీ వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలోనూ శ్రద్ధా దాస్ నటించింది.! పలు హిందీ సినిమాల్లో కూడా ఇప్పటికే నటించేసింది ఈ సొగసరి.!
Shraddha Das Telugu Love.. తెలుగు సినిమానే బెస్ట్..
సింగర్ అవ్వాలనుకుని, నటినయ్యానంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది శ్రద్ధా దాస్. ఏ మాత్రం సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, నటిగా మంచి మంచి సినిమాలు చేశాననీ చెప్పిందీమె.
తన టాలెంట్ చూసే తనకు బాగా అవకాశాలు వచ్చాయనీ, ఇప్పటికీ అలానే అవకాశాలు వస్తున్నాయనీ శ్రద్ధా దాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అయితే, బాలీవుడ్‌తో పోల్చితే తెలుగు సినీ పరిశ్రమే బెస్ట్.. అని శ్రద్ధా దాస్ వ్యాఖ్యానించడం గమనార్హం. హిందీలో ఓ సినిమా చేయడానికి నాలుగేళ్ళు పట్టేస్తుందట.
ఆ నాలుగేళ్ళ సమయంలో, తెలుగులో పధ్నాలుగు సినిమాల్లో నటించేయొచ్చరంటూ శ్రద్ధా దాస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అదీ నిజమే మరి.!
Also Read: కామెడీ కాదు, ‘కామమ్ ర్యాంప్’.!
హిందీ సినిమాల్లో నటించాలంటే, పెయిడ్ పీఆర్ వుండాలనీ.. సినిమా మొదలయి, పూర్తయ్యేదాకా లైమ్ లైట్‌లో వుండటానికి, పీఆర్ అవసరమనీ అంటోంది శ్రద్ధా దాస్.
తెలుగు సినిమాల్లో ఆ అవసరమే వుండదు. ఒక్క సినిమాలో నటించినా, పాపులారిటీ వచ్చేస్తుంది. ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారు. బోల్డంత అభిమానం ఇస్తారు.. అని శ్రద్ధా దాస్ అభిప్రాయపడింది.
