Shraddha Srinath Hello Goodbye చక్కనమ్మ ఏం చెప్పినా చక్కగానే వుంటుందంటారు. అంతేనా.? అలాగే అనుకోవాలా.?
అసలు ఇక్కడ ఈ చక్కనమ్మ ఏం చెప్పింది.? హలో అంటూ పలకరించింది, వెంటనే గుడ్ బై కూడా చెప్పేసింది. పైగా, ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోతో.!
శ్రద్ధా శ్రీనాథ్.. అదేనండీ, మన సహజ నక్షత్రం నాని (నేచురల్ స్టార్ కదా.!) హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమాలో ఆయనకు జోడీగా కనిపించిన కన్నడ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
బ్లాక్ అండ్ వైట్‌లో ఓ ఫొటో షేర్ చేసి, ‘హలో గుడ్ బై’ అని పేర్కొంది శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath).

ఇంకేముంది.? ‘ఏదో అయ్యిందామెకి.. సినిమాల్లోంచి బయటకు వెళ్ళిపోతున్నట్టుంది.. హలో అంటూ అందర్నీ పలకరించి, గుడ్ బై చెప్పేసింది..’ అంటూ రకరకాల ఊహాగానాలు షికార్లు చేశాయ్.!
Shraddha Srinath Hello Goodbye.. పబ్లిసిటీ కోసమేనా.?
అటెన్షన్ సీకర్స్.! అదేనండీ, అందరూ తమ గురించి మాట్లాడుకోవాలనుకునేవారు ఇలాంటి వ్యవహారాలే నడుపుతారు. శ్రద్ధా శ్రీనాథ్ కోరుకున్న అటెన్షన్ లభించింది. చాలామంది ఆమె గురించి ఆరా తీశారు.
చివరికి, అసలు విషయం చల్లగా చెప్పేసింది. ‘హలో గుడ్ బై అనేది ఓ పాట..’ అంటూ సెలవిచ్చిన శ్రద్ధా దాస్, ఒకింత ఘాటుగానే క్లాస్ తీసుకుంది.. ‘ఏవేవో ఊహించేసుకోవద్దు..’ అని చెబుతూ.
Also Read: ఎర్ర గులాబీ.! సెగలు రేపుతున్న సమంత సోయగం.!
అన్నట్టు, శ్రద్ధా శ్రీనాథ్ మంచి నటి. కానీ, ఏం లాభం.? ఆమె ఆటిట్యూడ్ చాలామందికి నచ్చడంలేదు. అదే అసలు సమస్య. సినీ పరిశ్రమలో ‘ఆటిట్యూడ్’ చూపిస్తే, అవకాశాలు తగ్గిపోతాయంటారు.
కానీ, తన ఆటిట్యూడ్ తన అందం.. అని చెబుతుంటుందామె. అదే తనకు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కూడానని శద్రధా శ్రీనాథ్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అదండీ అసలు సంగతి.
అన్నట్టు, శ్రద్ధా శ్రీనాథ్ కేవలం నటి మాత్రమే కాదు. సినిమాకి సంబంధించి వివిధ విభాగాలపై ఆమెకు మంచి పట్టు వుంది. మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఈ శ్రద్ధా శ్రీనాథ్. అన్నీ వున్నాగానీ, పాపం లక్కు మాత్రం కలిసి రావడంలేదంతే.