Shriya Saran About Pawankalyan.. జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్‌పై ‘అత్యద్భుతమైన’ ప్రశంసలు గుప్పించింది సినీ నటి శ్రియ.
పవన్ కళ్యాణ్ – శ్రియ శరణ్ కాంబినేషన్‌లో గతంలో ‘బాలు’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డ పవన్ కళ్యాణ్, గాయంతోనే షూటింగ్ పూర్తి చేశారని చెప్పింది శ్రియ.
‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రియ శరణ్, తెలుగులో పలువురు అగ్ర హీరోల సరసన నటించి, స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.
Mudra369
మెగాస్టార్ చిరంజీవితో ‘ఠాగూర్’ సినిమాలోనూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఠాగూర్’ సినిమాలోనూ నటించింది శ్రియ.
వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి అనీ, సమాజం పట్ల బాధ్యత గలిగిన పవన్ కళ్యాణ్, రాజకీయ నాయకుడిగా అద్భుతాలు చేస్తున్నారని శ్రియ తాజాగా ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.
Shriya Saran About Pawankalyan.. పవన్ కళ్యాణ్ అద్భుతాలు చేయగలరు..
‘డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పరిపాలనలో అద్భుతాలు చేయగలరు.. ఆ శక్తి ఆయనకు వుంది. ఆయన నిజాయితీ పరుడు.. అలాంటి వ్యక్తితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను..’ అని శ్రియ పేర్కొంది.

తెలుగు సహా తమిళ, హిందీ.. ఇలా పలు భాషల్లో నటించిన శ్రియ, మరోసారి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలని వుందని ఓ ప్రశ్నకు బదులిస్తూ చెప్పింది.
చిరంజీవితో (Mega Star Chiranjeevi) శ్రియ (Shriya Saran) ‘ఠాగూర్’ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది.
Also Read: కార్తీ ‘సర్దార్’ సీక్వెల్‌లో ఆషిక రంగనాథ్.!
ఇటీవలి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. పోటీ చేసిన అన్ని స్థానాల్నీ జనసేన పార్టీ గెలుచుకుంది.
మొత్తం 21 అసెంబ్లీ, 2 లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేసిన జనసేన (Jana Sena Party), 100 శాతం స్ట్రైక్ రేట్‌తో పొలిటికల్‌గా సూపర్ హిట్ కొట్టింది.
జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్‌ని ‘పొలిటికల్ పవర్ స్టార్’గా (Political Power Star Pawan Kalyan) రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.