Shriya Saran Trendy ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అంటుంటారు.! శ్రియ శరన్ విషయంలో అది ముమ్మాటికీ నిజమే.! అప్పుడెప్పుడో ‘ఇష్టం’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని తొలిసారిగా పలకరించింది శ్రియ.!
మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు స్టార్ హీరోల సరసన నటించి సూపర్ హిట్స్ కొట్టిన శ్రియ, యంగ్ హీరోల సరసన సైతం నటించి మెప్పించింది.
తెలుగు, తమిళ, హిందీ.. ఇలా పలు భాషల్లో నటించి, స్టార్‌డమ్ సొంతం చేసుకుంది శ్రియ.! అప్పటికీ, ఇప్పటికీ.. వయసు మీద పడుతున్న వన్నె తగ్గని సౌందర్యం ఆమెది.
Shriya Saran Trendy ఫ్యాషన్ ఐకాన్..
శ్రియ మంచి డాన్సర్. ఇది అందరికీ తెలిసిన విషయమే. శ్రియ అంటే, ఫ్యాషన్స్‌కి కేరాఫ్ అడ్రస్. శ్రియ స్మైల్, శ్రియ స్టైలింగ్.. వాట్ నాట్.. అన్నీ ప్రత్యేకమే.

శరీరానికి తగ్గట్టుగా ఫ్యాషన్ ట్రెండ్స్ వుంటే బావుంటుందన్నది శ్రియ తరచూ చెప్పే మాట.! ఒక్కోసారి, ఆయా కాస్ట్యూమ్స్‌కి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవాల్సి వుంటుందని శ్రియ చెబుతుంటుంది.
చూస్తున్నారు కదా.! ఇక్కడ ఆ కాస్ట్యూమ్‌కి శ్రియ (Shriya Saran) అందాన్నిచ్చిందా.? ఆ కాస్ట్యూమ్ వల్ల శ్రియ అందం మరింత పెరిగిందా.? తేల్చి చెప్పడం కష్టమేం కాదు.. శ్రియనే, ఆ కాస్ట్యూమ్‌కి అంత అందాన్ని తెచ్చింది.
వయసుదేముంది.?
శ్రియకి పెళ్ళయ్యింది.. ఓ కూతురు కూడా వుంది.! ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అని చెబుతుంటుంది అందాల భామ శ్రియ (Shriya Saran).
తల్లిగా కొత్త బాధ్యతలు వచ్చాయ్.. భార్యగానూ కొత్త బాధ్యతలు భుజానికెత్తుకున్నా.. అంతకు మించి, తనలో మార్పులేమీ రాలేదన్నది శ్రియ చెబుతున్నమాట.