ఆమె పాటలు పాడగలదు.. సంగీతం అందించగలదు.. సినిమాకి సంబంధించి దాదాపు అన్ని విభాగాలపైనా అవగాహన (Shruti Haasan Multi Talented Glamour) వుంది. విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తె (Shruti Haasan) కదా.. అందుకే మల్టీ టాలెంటెడ్ అయ్యింది.
బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. ఇలా వివిధ భాషల్లో స్టార్‌డమ్ సంపాదించుకున్న అందాల భామ శృతిహాసన్‌కి (Happy Birthday Shruthi Haasan) కెరీర్లో ఎత్తుపల్లాల విషయంలో ఖచ్చితమైన అవగాహన ఎందుకు వుండదు.?
కెరీర్‌లో సూపర్ హిట్స్ ఎలాగైతే చూసిందో, డిజాస్టర్స్ కూడా అలాగే చూసేసింది శృతిహాసన్.
‘సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి ఎవరికైనా సహజమే. హీరోయిన్లకే కాదు, హీరోలకీ, దర్శకులకీ, నిర్మాతలకీ.. ఇలా అందరికీ అవి మామూలే. అయితే, హీరోయిన్లు ఇంకాస్త ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు ఫ్లాప్ సినిమాలొచ్చినప్పుడు’ అంటూ శృతిహాసన్ వ్యాఖ్యానించింది.
‘నా వరకూ నాకు సక్సెస్, ఫెయిల్యూర్ అనే అంశాలపై లెక్కలు పక్కాగా వున్నాయి. ఫ్లాపొచ్చినా, హిట్టొచ్చినా.. ఆ ఆనందాన్నిగానీ, బాధనిగానీ ఎక్కువసేపు వుండనివ్వను. వెంటనే, తదుపరి ప్రాజెక్టు పైకి దృష్టి మళ్ళించేస్తాను..’ అని చెప్పిన శృతి, సినిమాల్లేకపోతే సంగీతాన్ని ఆస్వాదిస్తానని ఓ ప్రశ్నకు బదులిచ్చింది.
సినీ నటిగా గ్లామరస్ ప్రపంచంలో ఇంకాస్త గ్లామరస్‌గా కనిపించేందుకు ట్రెండీ దుస్తుల్ని ధరించడం మామూలేననీ, సాధారణ సమయాల్లో కూడా తాను ఫ్యాషన్‌ని ఎక్కువగానే ఇష్టపడతాననీ అంటోంది శృతిహాసన్.
2021 సంవత్సరాన్ని ‘క్రాక్’ (Krack) సినిమా హిట్టుతో ప్రారంభించిన శృతిహాసన్, త్వరలో ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
‘విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెనన్న అహంకారం నాలో ఎప్పుడూ కనిపించదు. కానీ, అది ఓ బాధ్యతగా భావిస్తాను. ఆయనకు చెడ్డ పేరు తెచ్చే పనులు ఎప్పుడూ చేయను..’ అని మరో ప్రశ్నకు సమాధానమిచ్చిన శృతిహాసన్ (Hbd Shruti Haasan), ప్రేమ అనేది జీవితంలో చాలా ప్రత్యేకమైనదనీ, ఓ సారి ప్రేమ విషయంలో ఫెయిలయ్యాననీ, అలాగని ఆ ఎపిసోడ్‌లో తానెవర్నీ నిందించదలచుకోలేదని మాజీ ప్రియుడితో బ్రేకప్ విషయమై నర్మగర్భంగా వ్యాఖ్యానించింది.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఏ సినీ పరిశ్రమలో సినిమాలు చేసినా, భాష ఒక్కటే తేడా తప్ప.. సినిమా మేకింగ్‌లో తేడాలేమీ వుండవనీ, సౌత్‌లో.. అందునా, తెలుగు సినీ పరిశ్రమలో సినిమాల నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంటుందని శృతిహాసన్ (Shruti Haasan Multi Talented Glamour) అభిప్రాయపడింది.
టాలీవుడ్‌లో చాలా బాగా డాన్సులేసే హీరోలు ఎక్కువగా వున్నారనీ, అలాంటివారందరితోనూ పనిచేసే అవకాశం తనకు దక్కిందని అంటోంది ఈ బ్యూటీ.