Siddarth Aditi Rao Hydari.. యంగ్ హీరో శర్వానంద్ పెళ్ళి పీటలెక్కబోతున్నాడు. శర్వానంద్‌కి కాబోయే భార్య పేరు రక్షిత. రక్షిత – శర్వానంద్‌ల ఎంగేజ్‌మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది.
సీనియర్ నటులు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునతోపాటు, యంగ్ హీరోలు రామ్ చరణ్ తదితరులూ ఈ ఎంగేజ్మెంట్ వేడుకకి హాజరై, కాబోయే వధూవరుల్ని ఆశీర్వదించారు.
వాళ్ళిద్దరి చుట్టూనే ఎందుకు.?
ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి, ఇంకో వైపు కింగ్ అక్కినేని నాగార్జున.. మరో వైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇలా ప్రముఖులంతా సందడి చేస్తున్నా, అందరి కళ్ళూ ఓ వైపు తిరిగాయ్.
ఔను.! శర్వానంద్ ఎంగేజ్మెంట్‌లో అందరి దృష్టీ ఓ జంట మీదనే పడింది. ఆ జంట ఎవరో కాదు, హీరో సిద్దార్ధ.. హీరోయిన్ అదితిరావు హైదరీ.!
Siddarth Aditi Rao Hydari.. జంటగా వచ్చారెందుకబ్బా.?
శర్వానంద్‌కి మంచి స్నేహితుడు సిద్దార్ధ. ఈ ఇద్దరూ కలిసి ‘మహాసముద్రం’ అనే సినిమా చేశారు. సినిమా ఫ్లాప్ అయ్యిందనుకోండి.. అది వేరే సంగతి.

‘మహాసముద్రం’ సినిమాలో అదితి రావు హైదరీ నటించింది. సో, శర్వానంద్ ఎంగేజ్మెంట్ సందర్భంగా ఆ కాంబినేషన్ స్పెషల్‌గా కనిపించిందన్నమాట.
Also Read: Naatu Naatu For Oscars: చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’.!
అంతేనా.? ఇంకేమన్నా వుందా.? సిద్దార్ధ – అదితి రావు హైదరీ మధ్య ఏదో వుందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
ఇద్దరూ సహజీవనం చేస్తున్నారనే రూమర్స్ నేపథ్యంలో, ఈ ఇద్దరూ శర్వానంద్ ఎంగేజ్మెంట్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. అద్గదీ అసలు సంగతి.