Siddharth Aditi Rao Hydari.. నటుడు సిద్దార్ధ, నటి అదితి రావు హైదరీ వైవాహిక బంధంతో ఒక్కటయ్యారట.
గత కొంతకాలంగా అదితి రావు హైదరీ, సిద్దార్ధ.. ఈ ఇద్దరూ ప్రేమలో వున్నారు.. సహజీవనం చేస్తున్నారనే పుకార్ల సంగతి సరే సరి.!
తెలంగాణలోని ఓ దేవాలయంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సిద్దార్ధ, అదితి రావు హైదరీల వివాహం జరిగినట్లు తెలుస్తోంది.
Siddharth Aditi Rao Hydari.. ఎందుకంత సీక్రెట్టు.?
అత్యంత రహస్యంగా ఈ వివాహం జరిగిందంటూ మీడియాలో కథనాలు దర్శనమిస్తున్నాయ్. నిజానికి, ఇందులో రహస్యమేముంది.?
గత కొన్నాళ్ళుగా సహజీవనంలో వున్న సిద్దార్ధ, అదితి పెళ్ళి పీటలెక్కడంలో వింతేమీ లేదు. కాకపోతే, సెలబ్రిటీలు కదా.. సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసుకోవడం అనేది ఓ పద్ధతి.
అలానే చెయ్యాలనే రూల్ ఏమీ లేదనుకోండి.. అది వేరే విషయం. ‘బొమ్మరిల్లు’ తదితర సినిమాలతో తెలుగునాట స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు సిద్దార్ధ.
Also Read: బరువులెత్తడం బ్రహ్మవిద్యేం కాదు భామామణులకి.!
అదితి రావు హైదరీ, హైద్రాబాదీ అమ్మాయే అయినా.. ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో నటించింది. బాలీవుడ్ నుంచి తెలుగు సినిమాల్లోకొచ్చింది అదితి రావు హైదరీ.
సిద్దార్ధ, అదితి రావు హైదరీ కలిసి ‘మహాసముద్రం’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.