Singer Sunitha Mango.. తెలుగు సినిమాల్లో హీరోయిన్, మామిడికాయ కొరికిందంటే.. ఆ వెనుక పెద్ద ‘కథ’ వుంటుంది.
మామిడికాయ్, లేదా చింతకాయ్.. ఇవన్నీ ‘నెల తప్పడానికి’ సూచనలుగా సమాజం మీద సినిమా ఓ పైత్యాన్ని బలంగా రుద్దేసింది.
చిన్న చిన్న చెట్లకీ మామిడికాయలు పెద్దయెత్తున కాసేస్తున్న రోజులివి.
ముచ్చటగా ఇంట్లో ఓ మామిడి మొక్కను పెంచుకుని, దానికి కాసిన తొలి మామిడికాయల్ని చూస్తూ మురిసిపోతూ పొటోలకు పోజలిస్తే, ‘నెల తప్పినట్టే’ భావించగలమా.?
Singer Sunitha Mango.. కథ ఏంటంటే.!
ప్చ్.! సింగర్ సునీతకి (Singer Sunitha) ఇదే చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె వయసేంటి.? ఆమె కొత్తగా నెల తప్పడమేంటి.? అన్న ఇంగితం లేకుండా పోయింది కొందరికి.
చిత్రమేంటంటే, బిగ్ బాస్ ఫేం సావిత్రికి (Savithri Shiva Jyothi) కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. మామిడి చెట్టు దగ్గర ఫొటోకి పోజిచ్చిందామె.
అంతే, ‘నెల తప్పిన’ బిగ్ బాస్ సావిత్రి.. అంటూ నెటిజనం కథలు అల్లేశారు. యూ ట్యూబ్ ఛానళ్ళ పైత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

‘ఈ రకమైన దుష్ప్రచారాన్ని వెంటనే ఆపెయ్యండి.. మీ వల్ల నా బతుకు నాశనమైపోతుంది.. నాకు వచ్చే అవకాశాలు ఆగిపోతున్నాయ్..’ అంటూ బిగ్ బాస్ సావిత్రి గుస్సా అయ్యింది.
తప్పెవరిది అధ్యక్షా.?
సునీత అయితే, ‘మా మామిడి చెట్టుకి తొలి పూత పూసింది.. అదే గుడ్ న్యూస్ అని నేను చెబితే.. నా మీద దుష్ప్రచారమా.?’ అంటూ వాపోయింది. ఇదండీ సంగతి.!
Also Read: Priyanka Jawalkar.. కిరికెట్టూ.. కనికట్టూ ఏంటో ఆ సీక్రెట్టూ.!
సినిమాలు జనం నెత్తిన పైత్యాన్ని రుద్దితే, ఆ పైత్యాన్నే నెటిజనం సినిమా వాళ్ళ మీద రుద్దుతున్నారన్నమాట.!
భావ ప్రకటనా స్వేచ్ఛ.. టిట్ ఫర్ టాట్.. ఇలాంటి మాటలు ఇక్కడ ఎంతవరకు సబబు.? ఎంతవరకు ప్రస్తావనార్హం.? అన్నవి ఆయా వ్యక్తుల విజ్ఞతని భట్టి ఆధారపడి వుంటాయ్.