మొట్టమొదటిసారిగా ఓ తెలుగమ్మాయ్ (Sireesha Bandla The First Telugu Astronaut) అంతరిక్ష యాత్ర చెయ్యబోతోంది. ఎప్పుడో చాలాకాలం కిందట భారతదేశం నుంచి రాకేశ్ షర్మ అంతరిక్ష యాత్ర చేశారు. ఆ తర్వాత కల్పనా చావ్లా కూడా అంతరిక్ష యాత్ర చేయడం తెలిసిన సంగతే.
భారతీయ మూలాలున్న సునీతా విలియమ్స్ కూడా అంతరిక్ష యాత్ర చేశారు. కానీ, మన తెలుగు నేల నుంచి.. అదీ ఓ మహిళ అందరిక్షంలోకి వెళ్ళడమంటే అది మనందరికీ గర్వకారణమే కదా.
Also Read: స్పేస్ టూరిజం.. అంతరిక్షంలో షికారు చేసొచ్చేద్దాం.!
అమెరికాలో స్థిరపడింది శిరీష బండ్ల కుటుంబం. గుంటూరు జిల్లాకి చెందిన ఈమె, అతి త్వరలో విర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపట్టనున్న అంతరిక్ష యాత్రలో పాల్గొననుంది. ఒకప్పటిలా కాదిప్పుడు.. పలు సంస్థలు అంతరిక్ష యాత్రల్ని నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి.
అంతరిక్ష యాత్రని స్పేస్ టూరిజంగా మార్చబోతున్నాయి చాలా సంస్థలు. స్పేస్ ఎక్స్ వంటివి ఇప్పటికే ఈ దిశగా అనేక ప్రయోగాలు చేసి సక్సెస్ అవడం తెలిసిన విషయమే. వారాంతాల్లో విదేశాలకు వెళ్ళి ఛిల్ అవడమెలాగో.. ఇకపై అంతరిక్ష యాత్రలు కూడా అలాగే కాబోతున్నాయన్నమాట.
Also Read: అంగారకుడిపైకి మనిషి వెళ్ళే దారేదీ.?
ఇక, శిరీష బండ్ల విషయానికొస్తే, మన తెలుగు సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. శిరీషకి శుభాకాంక్షలు తెలుపుతూ, బండ్ల కుటుంబానికి అరుదైన గౌరవం దక్కబోతోందంటూ ట్వీటేయడంతో, ఆమె ఆయనకు బంధువా.? అన్న చర్చ షురూ అయ్యింది.
చిన్నప్పటినుంచీ ఆస్ట్రోనాట్ అవ్వాలనే పట్టుదలతో ఆ దిశగా అడుగులేసిన శిరీష బండ్లకి.. ఈ అరుదైన అవకాశం చాలా తక్కువ కాలంలోనే వచ్చిందని అనుకోవాలేమో. అయితే, ఈ క్రమంలో ఆమె పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఏరోనాటిక్ ఇంజనీరింగ్ అలాగే ఎంబీఏ కూడా చదివిందట శిరీష బండ్ల (Sireesha Bandla The First Telugu Astronaut).