Sitara Ghattamaneni సితార.. సూపర్ స్టార్ మహేష్‌బాబు గారాల పట్టి. అప్పుడప్పుడూ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా మెరుస్తుంటుంది. అంతేనా, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్.
తాజాగా ‘పెన్నీ..’ అంటూ ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమా కోసం ఓ ఇంట్రెస్టింగ్ ప్రమోషనల్ సాంగ్ కూడా చేసేసింది. దీన్ని సితార తెరంగేట్రంగా చెప్పుకోవచ్చా.? అంటే, ఏమో, ఔనేమో.!
ఇదిలా వుంటే, ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషన్ కోసం సితార కూడా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తోంది.
ఇంటర్వ్యూల్లో సితార ముందు బోల్డన్ని ప్రశ్నలు వచ్చిపడుతున్నాయి. వాటికి, సితార చాలా కూల్ అండ్ లవ్లీగా.. అన్నట్టు సమాధానాలిస్తోంది.
Sitara Ghattamaneni.. చిరునవ్వుల సితార.!
చెరగని చిరునవ్వు సితార సొంతం. ఎప్పుడూ నవ్వతూనే వుంటుంది. ఏ ప్రశ్న అడిగినా, నవ్వుతూనే సితార సమాధానాలిస్తుండడం గమనార్హం.

అలా ప్రశ్నల పరంపరలో ఓ ప్రశ్న సితారను కొంత అయోమయానికి గురిచేసినట్టుంది. ఆ ప్రశ్న ఏంటంటే, ‘మీ అమ్మ నమ్రత లాగానే, నువ్వు కూడా అందాల పోటీలకు వెళతావా.?’ అని.
నమ్రత శిరోద్కర్, గతంలో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో ‘అంజి’ సినిమా చేసిన నమ్రత, సూపర్ స్టార్ మహేష్ సరసన ‘వంశీ’ సినిమాలోనూ నటించింది.
అందాల పోటీలు, మోడలింగ్.. సినిమాలు.. ఇలా నమ్రత వెనుక పెద్ద కథే వుంది.
ఆ ప్రశ్న సితారను అడగొచ్చా.?
ఇంతకీ, నమ్రత లాగానే సితార కూడా అందాల పోటీలకు వెళుతుందా.? లేదా.? ఈ వయసులో సితార ముందుంచాల్సిన ప్రశ్న కానే కాదిది.
సితార మాత్రం తనదైన స్టయిల్లో సమాధానమిచ్చింది.. అందాల పోటీల విషయమై. ఇప్పటికైతే ఏమీ అనుకోలేదు, ముందు ముందు ఆలోచిస్తానేమో.. అని చెప్పింది సితార.
చదువు, కెరీర్.. అన్నీ అమ్మ నమ్రత దగ్గరుండి చూసుకుంటుందంటూ సితార వ్యాఖ్యానించింది.
సితార చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ‘1 నేనొక్కడినే’ సినిమా పూర్తయ్యాక, అందులో తన పాత్రని చూసుకున్న తర్వాత మహేష్‌బాబు తనయుడు గౌతమ్ ఏడ్చేశాడట.
Also Read: నిహారిక కూడా మీ ‘ఆడకూతురు’ లాంటిదే కదా.!
ఎందుకంటే, అంత ఎమోషనల్‌గా వుంటుంది గౌతమ్ పాత్ర. నిజమే, గౌతమ్‌ని చూస్తున్నంతసేపూ ఆ పాత్రతో ప్రేక్షకులు అంతలా కనెక్ట్ అయిపోతారు.