ట్రెండ్ మారింది గురూ.! ఈ రోజు నమోదైన రికార్డుని, ఈరోజే ఇంకెవరైనా తిరగరాసెయ్యొచ్చు. మోడ్రన్ క్రికెట్‌లో అద్భుతాలకు కొదవ లేదు. అప్పుడెప్పుడో రవిశాస్త్రి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు (Six Sixers In Six Balls Yuvraj Singh) బాదితే (అంతర్జాతీయ క్రికెట్ పోటీల్లో కాకపోయినా) దాని గురించి గొప్పగా చెప్పుకున్నాం.
కానీ, వన్డే క్రికెట్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు పెను సంచలనం సృష్టించాడు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడానికి. 2007 వన్డే వరల్డ్ కప్ పోటీల్లో ఈ ఘనత సాధించాడు గిబ్స్. ఇక, పొట్టి క్రికెట్‌లో (టీ20) తొలిసారిగా ఈ ఘనత సాధించాడు యువరాజ్ సింగ్.
యువీ అప్పట్లో ఇంగ్లాండ్ జట్టుపై సిక్సర్ల మోత మోగించిన వైనం అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎంతో ప్రత్యేకం అని చాలామంది అనుకున్నారు. కానీ, అదే పొట్టి క్రికెట్‌లో ‘ఆరు బంతులు – ఆరు సిక్సర్ల’ ఘనతను ఇంకో క్రికెటర్ సొంతం చేసుకున్నాడు. అతనే వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పోలార్డ్.
పేరుకి వెస్టిండీస్ క్రికెటర్ అయినా, ఐపీఎల్ అతన్ని భారత క్రికెట్ అభిమానులకు అత్యంత సన్నిహితుడ్ని చేసేసింది. ఇప్పటిదాకా అంతర్జాతీయ క్రికెట్ పోటీల్లో ముగ్గరు క్రికెటర్లు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు (Six Sixers In Six Balls Yuvraj Singh) కొట్టిన ఘనతను సొంతం చేసుకున్నాడు.
ఇకపై, అత్యంత వేగంగా మరింతమంది ఈ ఘనతల్ని సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, క్రికెట్‌లో వేగం పెరిగింది. వీరబాదుడు బాదేటోడే మొనగాడైపోయాడు క్రికెట్‌లో. టెస్టు క్రికెట్, వన్డే క్రికెట్, టీ20.. ఇలా ఏదైనా.. ఇప్పుడు వేగమే ముఖ్యమైపోయింది మరి.
ఐదు రోజులు జరగాల్సిన టెస్ట్ మ్యాచ్, రెండు రోజుల్లోనే ముగిసిపోతోందంటే, దానర్థమేంటి.? ఐదు రోజులు ఆడే ఓపిక ఒకప్పుడు వుండేది.. ఇప్పుడు అంత ఓపిక క్రికెటర్లలో కన్పించడంలేదు. అందుకేనేమో.. వీర బాదుడికే ‘జయహో’ అంటున్నారంతా. అదే క్రికెట్ అభిమానులకీ నచ్చుతోంది కూడా. ధనా ధన్ (Six Sixers In Six Balls Yuvraj Singh) పేలాల్సిందే.. సిక్సర్లయినా.. వికెట్లయినా.!