Sneha Ullal Glamour.. అచ్చం ఐశ్వర్యారాయ్‌లా వుండడంతో ఆమెను అంతా ‘జూనియర్ ఐశ్వర్యారాయ్’ అన్నారు. అదే ఆమెకు సినిమా అవకాశాల్నీ బాగానే తెచ్చిపెట్టింది కూడా.!
‘ఐశ్వర్యారాయ్‌తో ఆమెకు పోలికేంటి.?’ అనే విమర్శలూ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె ఎవరో కాదు, స్నేహా ఉల్లాల్.
తెలుగులో ‘కరెంట్’, ‘సింహా’ తదితర సినిమాల్లో నటించిన స్నేహా ఉల్లాల్, బాలీవుడ్‌లోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు చేసిన విషయం విదితమే.
Sneha Ullal Glamour.. వెండితెరతోపాటు వెబ్ సిరీస్‌లు కూడా..
ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో హల్‌చల్ చేసేస్తోన్న ఈ బ్యూటీ, తాజాగా వెబ్‌సిరీస్‌లపై ఫోకస్ పెట్టింది.
వెండితెర నుంచి డిజిటల్ ప్లాట్‌ఫాంపైకి రావడం కొత్త అనుభవం అంటోన్న స్నేహా ఉల్లాల్.. నటనా రంగంలోకి కాస్త ఆలస్యంగా వచ్చి వుంటే బావుండేదంటూ తన మనసులో మాటని బయటపెట్టింది.
మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వేగంగా వచ్చేశాననీ, బహుశా అదే తొందరపాటు అయి వుంటుందనీ.. తొందరపడకుండా టైం తీసుకుని వుంటే, నటనలో ఆరితేరి వుండేదానని చెప్పింది స్నేహా ఉల్లాల్.
సినిమాల్లోకి వచ్చాక, అన్నీ నేర్చుకోవాల్సి వచ్చిందంటున్న స్నేహా ఉల్లాల్.. ఆ నేర్చుకునే క్రమంలో చిన్న చిన్న తప్పిదాలు జరిగి, పెద్ద పెద్ద అవకాశాలకు దూరమయ్యానని చెప్పింది.
ఏ సమస్యలూ లేవుగానీ..
అయితే, కెరీర్ విషయంలో తానెప్పుడూ ఇబ్బంది పడలేదట. సినిమా కెరీర్‌లో తాను ఎక్కువగా ప్రొఫెషనలిజంనే చూశాననీ, టాలీవుడ్‌లోనూ.. బాలీవుడ్‌లోనూ.. ఎక్కడా ఎలాంటి సమస్యలూ ఎదురుకాలేదనీ స్నేహా ఉల్లాల్ వెల్లడించింది.
సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ, దాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరమే లేదని ఓ ప్రశ్నకు బదులిచ్చింది స్నేహా ఉల్లాల్. నటిగా ఇంకా చాలా కెరీర్ వుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిందీ ముద్దుగుమ్మ.
వెబ్ సిరీస్ అనగానే కొంచెం హాట్ కంటెంట్ ఎక్కువగానే వుంటుందన్న అభిప్రాయంతో తానూ ఏకీభవిస్తాననీ, అయితే.. సినిమాల్లో కూడా అది సర్వసాధారణమే అయిపోయిందని మరో ప్రశ్నకు సమాధానమిచ్చింది స్నేహా ఉల్లాల్.
ఓ మంచి కమ్ బ్యాక్ మూవీ కోసం ఎదురుచూస్తోంది స్నేహా ఉల్లాల్ అలియాజ్ జూనియర్ ఐశ్వర్యారాయ్.