Sobhita Dhulipala Cheekatilo Review.. శోబిత ధూళిపాల ప్రధాన పాత్రలో తెరకెక్కింది ‘చీకటిలో’.! ఇదొక థ్రిల్లర్.!
హత్యలు జరుగుతుంటాయ్.. ఆ హత్యల్ని ఛేదించే బాధ్యతని భుజాన వేసుకుంటుంది ఓ క్రైమ్ జర్నలిస్ట్.! ఇంతకీ, క్రిమినల్ ఎవరు.? ఎందుకు వరుస హత్యలు చేస్తున్నాడు.? అన్నది మిగతా కథ.
చివరి వరకు కిల్లర్ ఎవరన్నది అస్సలేమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడటం ఒక్కటీ, ఈ వెబ్ సిరీస్‌లో ఒకింత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్.
ఓ మీడియా హౌస్‌లో పని చేసే జర్నలిస్ట్, తాను పాటించే విలువలకు వ్యతిరేకంగా ఆ సంస్థ నడుస్తుండడంతో, దానికి రాజీనామా చేసి, స్నేహితుల సూచనతో పాడ్ కాస్ట్ మొదలు పెడుతుంది.
Sobhita Dhulipala Cheekatilo Review.. క్రైమ్ జర్నలిస్ట్ తప్ప…
స్నేహితురాలు హత్యకు గురైతే, ఆ మిస్టరీని ఛేదించేందుకు క్రైమ్ జర్నలిస్ట్ రంగంలోకి దిగడం, తీగ లాగితే డొంక కదిలిన చందాన, కొత్త కొత్త విషయాలు వెలుగు చూడటం.. ఆసక్తిని రేకెత్తిస్తాయి.
అయితే, పోలీస్ అధికారి నామ మాత్రంగా మిగిలిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పోనీ, స్పెషల్ ఆఫీసర్ వచ్చాక అయినా, ఆ లేడీ ఆఫీసర్ ఏమన్నా చేస్తుందా.? అంటే, అదీ లేదు.
దాదాపుగా పాత్రలన్నీ డమ్మీనే, ఒక్క మెయిన్ లీడ్ తప్ప… అన్నట్లుంటుంది వ్యవహారం.
పోలీస్ అధికారులు కేసుని ఛేదించేందుకు ప్రయత్నించాలి, కుటుంబ సభ్యులు అలాగే స్నేహితుల నుంచి మెయిన్ లీడ్‌కి సహాయ సహకారాలు అందాలి. అప్పుడు కథ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది.
ఇంతకీ, ఎవరు చంపి వుంటారు.? అన్న చిన్నపాటి ఉత్కంఠ తప్ప, కథా గమనంలో అస్సలేమాత్రం వేగం కనిపించదు.
‘చీకటిలో’ మధ్యలో కంటెంట్ అంతా వదిలేసి, బిగినింగ్.. ఎండింగ్.. చూసేస్తే సరిపోతుందనిపిస్తుంది. అంతకు మించి థ్రిల్లింగ్ కంటెంట్ ఏమీ లేదు మరి.!
సింపుల్‌గా చుట్టేశారన్న బావన చాలా సీన్స్‌లో కలుగుతుంది. కొన్ని చోట్ల మాత్రం, సినిమాటోగ్రఫీ విభాగం సన్నివేశాల్ని బాగా క్యాప్చర్ చేసింది.
మెయిన్ లీడ్ శోబిత ధూళిపాల పాత్ర తాలూకు వాయిస్ బావుంది. కానీ, ఆమెను తెరపై చూపించిన విధానం.. అంత ఆకట్టుకోదు.
‘ఈ పాత్రలో ఇంకెవరైనా అయితే బావుండేది’ అని ‘చీకటిలో’ వెబ్ సిరీస్ చూసినంత సేపూ అనిపిస్తుంటుంది శోభిత ధూళిపాల విషయంలో.
ఇలాంటి వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో బోల్డన్ని వున్నాయి. సినిమాలూ చాలానే వచ్చేశాయ్. వాటితో పోల్చితే, చాలా చప్పగా అనిపిస్తుంది ‘చీకటిలో’.! తీరిక మరీ ఎక్కువైపోతే తప్ప, ‘చీకటిలో’ పూర్తిగా చూడలేం.
సుమారు రెండు గంటలే నిడివి వున్నా, అక్కడికేదో నాలుగైదు గంటలు.. ఆ పైన సమయం ఈ ‘చీకటిలో’ కోసం వెచ్చించినంత నీరసం వచ్చేస్తుంది.
సైకో కిల్లర్ పాత్ర కోసం మేకర్స్ ఎంచుకున్న నటుడి విషయంలోనే వ్యవహారం బొక్క బోర్లా పడిపోయింది. విషయం వున్న నటులు చాలామందే వున్నా, ఎవర్నీ సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు.
సీనియర్ నటుడు సురేష్ స్క్రీన్ ప్రెజెన్స్ సిల్లీగా అనిపిస్తుంది. నటి ఇషా చావ్లా విషయంలోనూ అదే ఫీలింగ్.!
ఇంకాస్త గ్రిప్పింగ్‌గా, పాత్రల్ని ఇంకొంచెం బలంగా డిజైన్ చేసుకుని వుంటే మాత్రం.. మంచి రిజల్ట్ వచ్చి వుండేది.
