Sobhita Dhulipala MIH Beauty.. మోడలింగ్ రంగంలో సత్తా చాటి వెండితెరపై వెలుగులు విరజిమ్ముతున్న ముద్దుగుమ్మ శోభిత ధూళిపాళ్ల. పదహారణాల తెలుగమ్మాయ్.
ప్రస్తుతం సౌత్ సినిమాలతో పాటూ, నార్త్‌లోనూ తన హవా చూపిస్తోంది. అయితే, బిగ్గెస్ట్ ప్రాజెక్టులు శోభితను పెద్దగా పలకరించడం లేదనే చెప్పొచ్చేమో
ముఖ్యంగా తెలుగు సినిమాల్లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతోంది శోభిత ధూళిపాళ్ల. కానీ, బాలీవుడ్ వెబ్ సిరీస్‌లతో తనలోని నటికి చాలెంజ్ విసిరే పాత్రలను దక్కించుకుంటోంది.
Sobhita Dhulipala MIH Beauty.. అది వేరు.. ఇది వేరు..!
ఇటీవలే ‘నైట్ మేనేజర్’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించింది. తాజాగా ‘మేడ్ ఇన్ హెవెన్’ అను మరో వెబ్ సిరీస్‌తో రాబోతోంది.
ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో తెగ బిజీగా వుందీ వైజాగ్ ముద్దుగుమ్మ.
సినిమాల్లో అవకాశాల కోసం చాలా చాలా కష్టపడ్డాననీ, ఆ కష్టమే తనను ఇంత వరకూ తీసుకొచ్చిందనీ ప్రమోషన్లలో భాగంగా శోభిత ధూళిపాళ్ల చెప్పుకొచ్చింది.

అలాగే, ఈ మధ్య తన పర్సనల్ లైఫ్‌పై వచ్చిన రూమర్లు తనను ఎంతో బాధపెట్టాయని కూడా చెప్పుకొచ్చింది.
పర్సనల్ లైఫ్‌నీ ప్రొఫిషనల్ లైఫ్‌నీ వేరుగా చూడాలని ప్రేక్షకుల్ని కోరుతోంది శోభిత ధూళిపాళ్ల.
స్వర్గంలో చెక్కబడిన శిల్పమే.!
ఇక, శోభితకు నెట్టింట్లోనూ పాలోయింగ్ ఎక్కువే. అందుకు కారణం ఆమె రెగ్యలర్‌గా పోస్ట్ చేసే గ్లామరస్ పోజులే. ఎప్పటికప్పుడే హాట్ ఫోటో షూట్లతో నెటిజన్లను సంతోష పెడుతుంటుంది శోభిత ధూళిపాళ్ల.
Also Read: ‘బేబీ’ విశ్వక్ సేన్.! కెలుక్కోవడమంటే అదో సరదా.!
తాజాగా ‘మేడ్ ఇన్ హెవెన్’ సిరీస్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో శోభిత నిజంగానే స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవ కన్యలా మెరిసిపోతోంది.

అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ రెండో సీజన్ ఆగస్టు 10 నుంచి స్ర్టీమింగ్ కానుంది. ఆల్రెడీ ఫస్ట్ సీజన్‌లో శోభిత తన టాలెంట్ చూపించింది. రెండో సీజన్‌లో ఆమె నటన అంతకు మించి అనేలా వుండబోతోందిట.
అన్నట్లు ‘మంకీమేన్’ అనే ఓ ఇంగ్లీష్ మూవీలోనూ శోభిత నటిస్తోంది.