Sonakshi Sinha 16months Pregnancy.. పెళ్ళయ్యిందంటే, విశేషం ఏమీ లేదా.? అని పెద్దలు అడగడం మామూలే.! పెద్దోళ్ళే కాదు, స్నేహితులూ అడుగుతారు.! ఇదో సాధారణ ప్రశ్న.!
సెలబ్రిటీలు కదా.. వాళ్ళ మీద మీడియాకి స్పెషల్ ఫోకస్ వుంటుంది. పెళ్ళయిన నటీనటులకి, పిల్లలెప్పుడు.? అన్న ప్రశ్న మామూలే.
సమాధానం చెప్పడం, చెప్పకపోవడం.. అన్నది ఆయా వ్యక్తుల ఇష్టాయిష్టాల్ని బట్టి వుంటుందనుకోండి.. అది వేరే సంగతి.
ప్రెగ్నెన్సీ, డివోర్స్.. వీటి చుట్టూ గాసిప్స్ అనేవి సెలబ్రిటీలకు కొత్తేమీ కాదు. ఒక్కొక్కరూ ఒక్కోలా ఈ గాసిప్స్ విషయంలో స్పందిస్తుంటారు.
Sonakshi Sinha 16months Pregnancy.. పదహారు నెలల ప్రెగ్నెన్సీ..
మొన్నీమధ్యనే నటి త్రిషకి పెళ్ళి గాసిప్స్ గురించి ప్రశ్న వస్తే, ‘పెళ్ళి మాత్రమేనా.? హనీమూన్ కూడా మీరే ప్లాన్ చేసెయ్యండి..’ అంటూ సెటైర్ వేసింది.
దాంతో, త్రిష పెళ్ళి గాసిప్స్.. తాత్కాలికంగా ఆగిపోయాయి. కొన్ని రోజులయితే మళ్ళీ కొత్తగా ఆ గాసిప్స్ షురూ అవుతాయ్.. వాటిని ఆపలేం.
తాజాగా, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాని చికాకు పెడుతున్నాయి ప్రెగ్నెన్సీ గాసిప్స్. ఆ గాసిప్స్‌పై సోనాక్షి సిన్హా స్పందించక తప్పలేదు.

‘పదహారు నెలలుగా ప్రెగ్నెన్సీని మోస్తున్నా..’ అంటూ సోషల్ మీడియా వేదికగా సోనాక్షి సిన్హా సెటైరేసింది. దాంతో, అంతా అవాక్కయ్యారు.
మామూలుగా అయితే, తొమ్మి నెలల గర్భం తర్వాత బిడ్డకు కాన్పునివ్వడం జరుగుతుంది. పదహారు నెలల ప్రెగ్నెన్సీ.. అంటే, సెటైర్లో వేరే లెవల్.. అనే అనుకోవాలి.
మాతృత్వం వరం.. కాకూడదు యెటకారం.!
అయితే, మాతృత్వం ఓ వరం ఏ మహిళకి అయినా. అలాంటి మాతృత్వం మీద సెటైర్లు వేయడమేంటి.? అంటూ, సోనాక్షి సిన్హా మీద ట్రోలింగ్ షురూ అయ్యింది.
Also Read: అధరామృతం.. అవ్వకూడదు విషపూరితం.!
చక్కనమ్మ ఏం చెప్పినా అందమే.. అనుకుంటే పొరపాటు.! ఇక్కడ సోనాక్షి సిన్హా, ఒకింత హుందాగా స్పందించి వుండాల్సింది. సెటైరేసి, ట్రోలింగ్ కష్టాల్ని కొనితెచ్చుకుంది.
అన్నట్టు, సోనాక్షి సిన్హా నటిస్తున్న ‘జటాధర’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సుధీర్‌బాబు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
