Sonam Kapoor Publicity Stunts: సెలబ్రిటీలు ఏం చేసినా కొత్తగా వుండాలి మరి.! అలా కొత్తగా చెప్తేనే, చేస్తేనే వాళ్ళు సెలబ్రిటీలవుతారు. సాధారణ జనం కూడా సెలబ్రిటీలయ్యేందుకోసం కొత్తకొత్తగా ట్రై చేస్తుంటారనుకోండి.. అది వేరే సంగతి.
వెర్రి వెయ్యి విధాలు.. అనేవారు వెనకటికి పెద్దలు. ఇప్పుడు వెర్రి.. వేలంవెర్రి.. లక్షల రకాలు, కోట్ల రకాలు.! ఎవరికి నచ్చిన దారిలో వాళ్ళు తమకు నచ్చినది చేసుకుంటూ పోతుంటారంతే.!
అసలు విషయానికి వస్తే, బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన బేబీ బంప్ ప్రదర్శించేందుకోసం, తద్వారా తాను తల్లిని కాబోతున్న విషయాన్ని బయటపెట్టడం కోసం ఓ ఫొటోసెషన్ చేయించుకుంది.. అదీ కూడా తన భర్తతో కలిసి.
Sonam Kapoor Publicity Stunts ఫ్యాషన్‌కి కేరాఫ్ అడ్రస్.!
సోనమ్ కపూర్ (Sonam Kapoor) అంటేనే ఫ్యాషన్‌కి బ్రాండ్ అంబాసిడర్ కదా.! అందుకే, తల్లి కాబోతున్న విషయాన్ని కూడా ఒకింత ఫ్యాషనబుల్‌గా చెప్పాలనుకుంది. చెప్పేసింది కూడా. అంతే, సోషల్ మీడియాలో రచ్చ షురూ అయ్యింది.
దారుణంగా సోనమ్ కపూర్‌ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. చెయ్యరా మరి.? అనకండి.! అలా అంటే సెలబ్రిటీలకు కోపమొచ్చేస్తుంటుంది.

సమీరా రెడ్డి (Sameera Reddy) అయితే ఇంకాస్త ధైర్యం చేసి స్విమ్మింగ్ పూల్‌లో టూ పీస్ బికినీ సొగసులతో బేబీ బంప్ ప్రదర్శించి అప్పట్లో పెను సంచలనానికి కారణమైంది.
చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే వుంటుంది.! ఇలా బేబీ బంప్స్ ప్రదర్శిస్తూ విమర్శలు ఎదుర్కొన్నవారు.. తద్వారా పబ్లిసిటీ పొందినవారు.. బోల్డంతమంది వున్నారు సినీ రంగంలో. ఎవరిష్టం వాళ్ళది.!
Also Read: అనసూయ ‘ఉవాచ’.! హ్యాపీ ఫూల్స్ డే.!
ట్రెండ్ మారింది. ట్రోలింగ్ జరుగుతోంటే, సదరు సెలబ్రిటీల పాపులారిటీ మరింత పెరుగుతుందని అర్థం.