రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు. కానీ, రాజకీయాలంటే ఆసక్తి వుండాలి. ప్రజలకి సేవ చేయాలన్న మంచి ఆలోచన వుండాలి. అంతేగానీ, కరెన్సీ నోట్లతో ఓట్లు కొనాలనీ, లిక్కర్ బాటిల్స్ పంచేసి ఓట్లను దండుకోవాలనీ ఆలోచించేవారు మాత్రం రాజకీయాల్లో వుండకూడదు. బాధాకరమైన విషయమేంటంటే, ఇక్కడ రెండో కేటగిరీకి చెందినవారికే (Sonu Sood The Saviour Of India Covid 19 Corona Virus) రాజకీయాల్లో అద్భుతమైన అవకాశాలు దక్కుతున్నాయి. ఇదీ నేటి భారతం.
సినీ నటుడు సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తాడా.? రాడా.? ఈ ప్రశ్న చుట్టూ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఓ వ్యక్తిగా సోనూ సూద్ పెద్ద మనసుతో కరోనా పాండమిక్ సమయంలో తనకు తోచిన రీతిలో దేశ ప్రజలకు వీలైనంత మేర సాయం చేస్తున్నాడు. అలాంటి గొప్ప వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే, తమకు మేలు జరుగుతుందని ప్రజలు భావించడంలో తప్పేముంది.?
కానీ, సోనూ సూద్ రాజకీయాల్లోకి రానంతవరకే మంచోడు. రాజకీయాల్లోకి వస్తే మాత్రం, ఆయనకు ‘మకిలి’ అంటించేస్తారు రాజకీయ నాయకులు. కులం, మతం, ప్రాంతం.. ఇలా అన్ని రకాల పైత్యాలూ సోనూ సూద్ మీద రుద్దేస్తారు. ప్రముఖ తమిళ సినీ నటుడు కమల్ హాసన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వీళ్ళందరి విషయంలో ఏం జరిగిందో చూశాం.
రాజకీయాలు కలుషితమైపోయాయి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఎవరన్నా ఆ రాజకీయాల్ని ప్రక్షాళన చేయాలనుకుంటే మాత్రం, అది సాధ్యమయ్యే పని కాదు. బురద అంటించుకోవడం మాత్రమే మిగులుతుంది ఎవరైనా రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తే.
సోనూ సూద్.. అందుకేనేమో, స్పష్టంగా చెప్పేశాడు తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని. ఇలా తన సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పాడు. పది మందికి సాయం చేసే అవకాశం దేవుడిచ్చినందుకు ఆనందంగా వుందని చెబుతున్నాడు సోనూ సూద్ (Sonu Sood The Saviour Of India Covid 19 Corona Virus).