ప్రత్యర్థికి, ప్రత్యర్థి స్టయిల్లోనే సమాధానం చెప్పాలన్నది రాయల్ బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly About Politics And Cricket) సిద్ధాంతం.
రాయల్ బెంగాల్ టైగర్.. సౌరవ్ గంగూలీ (Royal Bengal Tiger Sourav Ganguly) రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడా.? ఈ ప్రశ్న చాలాకాలంగా వినిపిస్తోంది. సమాధానమే దొరకడంలేదు. ఈ విషయమై ‘దాదా’ని ప్రశ్నిస్తే, నవ్వేస్తుంటాడు. తనకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారనీ, రాజకీయాలపై ప్రస్తుతానికి పెద్దగా ఆసక్తి లేదని పలు సందర్భాల్లో చెప్పాడు.
టీమిండియా కెప్టెన్సీ అనుకోకుండా దక్కిందనీ.. రాజకీయాలకు సంబంధించి ముందు ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే జోస్యం చెప్పలేననీ తాజాగా వ్యాఖ్యానించాడు దాదా. నిజమే, గంగూలీని టీమిండియా కెప్టెన్సీ అనూహ్యంగానే వరించింది.
అయితే, భారత క్రికెట్ కొత్త ‘వేగాన్ని’, కొత్త ‘పోరాట పటిమ’నీ గంగూలీ నాయకత్వంలోనే సంతరించుకుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ప్రత్యర్థికి, ప్రత్యర్థి స్టయిల్లోనే సమాధానం చెప్పాలన్నది గంగూలీ (Sourav Ganguly About Politics And Cricket) సిద్ధాంతం. అదే ఆ తర్వాత చాలామంది భారత కెప్టెన్లు పాటిస్తూ వచ్చారు, పాటిస్తున్నారు కూడా.
కాగా, తన సహచరుడు రాహుల్ ద్రావిడ్, టీమిండియాకి యువ రక్తాన్ని అందించడంలో ఎంతో కృషి చేస్తున్నాడనీ, యువ టీమిండియాకి రాహుల్ ‘గోడ’లా నిలుస్తున్నాడనీ గంగూలీ చెప్పాడు.
‘రాజకీయాల విషయానికొస్తే, ఎక్కడిదాకా వెళుతుందో చూద్దాం. ఔననీ, కాదనీ నేను చెప్పలేను. నా జీవితంలో అన్నీ హఠాత్తుగా జరిగినవే బీసీసీఐ (BCCI Sourav Ganguly) అధ్యక్ష పదవితో సహా..’ అంటూ దాదా నవ్వేశాడు.
ఇటీవల గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడ్డంపై తనదైన స్టయిల్లో సమాధానమిచ్చిన గంగూలీ (Sourav Ganguly About Politics And Cricket), వయసు మీద పడుతోంది కాబట్టి అవన్నీ సాధారణమేననీ, తీవ్రమైన సమస్య కాకపోయినా వైద్యుల సూచనతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందన్నాడు.
గంగూలీ అంటేనే అంత. ఏం మాట్లాడినా, కుండబద్దలుగొట్టినట్టే వుంటుంది. ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్ అనుకునే నైజం సౌరవ్ గంగూలీది. బెంగాల్‌కి చెందిన గంగూలీ పేరు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో మార్మోగిపోవడం వింతేముంది.
క్రికెట్ రాజకీయాల్ని తట్టుకున్న గంగూలీకి, రియల్ లైఫ్ రాజకీయాల్ని తట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అయితే, ఆయనకు రాజకీయాల పట్ల ఆసక్తి వుందా.? లేదా.? (Sourav Ganguly About Politics And Cricket) అన్నదే అసలు ప్రశ్న ఇక్కడ.