గేమ్ ఆడాలంటే, కుట్రలు చేయాలా.? తెర వెనక ఒకరి మీద ఇంకొకరు చాడీలు చెప్పాలా.? ఇద్దరు స్నేహితుల్ని విడగొట్టడమే గెలుపు సూత్రమా.? (Sree Mukhi Himaja BB3) పైకి నవ్వుతూ వెనకాల గోతులు తవ్వడం, తద్వారా గెలుపుకు బాటలు వేసుకోవడం సమంజసమా.?
బిగ్ హౌస్‌లో ఏం జరిగినా, అందులో జరిగే సంఘటనల్ని బట్టి ఆడియన్స్ ఎవరు హౌస్‌లో ఉండాలో, ఎవరు ఎలిమినేట్ అవ్వాలో తేల్చాల్సి ఉంటుంది. అది తెలిసి, హౌస్‌లో ఎందుకిన్ని కుట్రలూ, కుతంత్రాలు.? బయటికొచ్చాక ఎవరి దారి వారిదే. స్నేహితుల్లా కలిసి ఉండొచ్చు. ఇష్టం లేకపోతే, ఎవరి పనులు వాళ్లు చేసుకోవచ్చు.
నిజానికి బిగ్‌హౌస్‌లోకి వచ్చిన వారెవరూ ఇమ్మెచ్యూర్డ్ కాదు. అందరూ మెచ్యూర్డ్ మెంటాల్టీస్ ఉన్నవారే. కానీ, అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అనడానికి వీల్లేదు. రాహుల్ విషయంలో అంతలా కక్ష్య కట్టాల్సిన అవసరం శ్రీముఖికి లేదు. కానీ, కక్ష్య కట్టేసింది. కామ్‌గా ఉంటూ పుల్లలు పెట్టాల్సిన అవసరం మహేష్‌కి లేదు. కానీ, చేస్తున్నాడు.
హిమజ మరీ ఓవర్‌గా రియాక్ట్ అవుతోంది. అంతా నా ఇష్టం, అనే వైఖరి ఆమెది. పునర్నవి కావచ్చు, ఇంకొకరు కావచ్చు.. అందరూ ఆయా అంశాల పట్ల అతిగానే స్పందిస్తున్నారు. అయితే, శ్రీముఖితో పాటు, హిమజ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతోంది.
కేవలం, రాహుల్ విషయంలోనే కాదు, గెలవడం కోసం ఎవరినైనా ముంచేయడానికి ఆయా కంటెస్టెంట్స్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి శ్రీముఖి (Sree Mukhi Himaja BB3) చేస్తున్న ప్రయత్నం విమర్శలకు తావిస్తోంది. మరోపక్క హిమజ కూడా, అదే బాటలో పయనిస్తోంది. లేటెస్ట్ వీక్ నామినేషన్స్ సందర్భంగా హిమజ అసలు రూపం బయటపడిపోయింది.
తెర వెనకాల చాడీలు చెబుతున్న ఆమె నైజాన్ని అషూ బయటపెట్టేసింది. తద్వారా బయట చాలా నెగిటివిటీని సంపాదించుకుంటోంది. అయితే, కేవలం గంటపాటు ప్రసారమయ్యే ఎపిసోడ్‌తో ఎవరి విషయంలోనూ ఓ అభిప్రాయానికి వచ్చేయలేం. హౌస్‌లో ఏం జరిగినా, అది జస్ట్ ఓ స్కిట్‌లాంటిది అనుకోవడమే మంచిది.