Sreeleela Birthday Gift Aadikeshava.. అరరె.! శ్రీలీలకి బర్త్ డే గిఫ్ట్ ఏమివ్వాలబ్బా.? ఇలా ఆలోచనలో వున్నాడు యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్.!
జస్ట్ బర్త్ డే విషెస్ చెప్పి ఊరుకుందామని వైష్ణవ్ తేజ్ అనుకుంటే, ఆయన తల్లి రాధిక మాత్రం.. పుట్టినరోజు గిఫ్ట్ ఏమిస్తావ్.? అని అడిగేసింది.!
ఆలోచించుకునేలోపు, ‘చెరో వెయ్యి వేసుకుని.. రైస్ కుక్కర్ గిఫ్ట్‌గా ఇస్తే బావుంటుంది’ అంటాడు సుదర్శన్.!
Sreeleela Birthday Gift Aadikeshava.. దోమల బ్యాట్ అయితే.. బడ్జెట్ కలిసొస్తుంది కదా.!
ఇంతలోనే వైష్ణవ్ తేజ్ కల్పించుకుని, ‘దోమల బ్యాట్ అయితే ఇంకా తక్కువలో అయిపోతుంది కదా..’ అంటాడు సుదర్శన్‌తో.!
ఇదంతా ‘ఆదికేశవ’ సినిమాలోని ఓ సీన్ మాత్రమే. దాన్ని శ్రీలీల (Happy Birthday Sreeleela) బర్త్ డే సందర్భంగా వాడేసుకున్నారన్నమాట.!
Also Read: మిల్కీ బ్యూటీ తమన్నా ఒప్పేసుకుంది.!
అద్గదీ అసలు సంగతి.! ఏమాటకామాటే చెప్పుకోవాలంటే.. శ్రీలీల అల్ట్రా క్యూట్‌గా కనిపించింది ఈ ప్రోమో వీడియోలో.
శ్రీలీల (Sreeleela) పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో ఈ ఇంట్రెస్టింగ్ ప్రోమోని వెరీ వెరీ స్పెషల్‌గా రిలీజ్ చేసింది ‘ఆదికేశవ’ టీమ్.