Sreeleela Danger Bells Tollywood.. నో డౌట్.. శ్రీలీల చాలా చాలా లక్కీ.! తెలుగులో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలొస్తున్నాయ్.!
కొత్త సినిమా ప్రారంభమవుతోందంటే, శ్రీలీల పేరే హీరోయిన్‌గా తొలుత చర్చకు వస్తోంది యంగ్ హీరోలకు సంబంధించి.
ఆ తర్వాత, రకరకాల క్యాలిక్యులేషన్స్ నేపథ్యంలో శ్రీలీల పేరు కొన్ని పెద్ద ప్రాజెక్టుల నుంచి పక్కకు వెళుతోందనుకోండి.. అది వేరే సంగతి.
అయినాగానీ, శ్రీలీలకి అవకాశాలొస్తున్నాయ్.. ‘మాస్ జాతర’ కూడా ఆ కోవలోదే. ఆల్రెడీ ‘ధమాకా’తో హిట్టుకొట్టిన జంట రవితేజ – శ్రీలీల.. ఈసారి మళ్ళీ ఆ మ్యాజిక్ చేస్తారా.? చూడాలిక.
ఇంతకీ, శ్రీలీల పాత్ర ఏంటి సినిమాలో.? ఎంత స్క్రీన్ స్పేస్ ఆమెకు ఇచ్చి వుంటారు.?
ఫస్టాఫ్ తర్వాత కనిపించదా.? ఫస్టాఫ్ తర్వాత మాత్రమే కనిపిస్తుందా.? ఇలా బోల్డన్ని కామెంట్లు పడుతున్నాయ్.
Sreeleela Danger Bells Tollywood.. శ్రీలీల ఎందుకిలా.?
కారణం అందరికీ తెలిసిందే. నితిన్ సినిమా ‘తమ్ముడు’లో అకస్మాత్తుగా మాయమైపోతుంది. ‘జూనియర్’ సినిమాలోనూ దాదాపు అదే పరిస్థితి.
పాటలకు తప్ప, శ్రీలీల ఎందుకూ పనికిరాదన్న చర్చ అంతటా జరుగుతోంది. ఇదే ప్రశ్న, శ్రీలీలకి ‘మాస్ జాతర’ ప్రెస్ మీట్‌లో ఎదురైంది.
నిజానికి, అది శ్రీలీల సమస్య కాదు. శ్రీలీలతో సినిమా చేసే దర్శక నిర్మాతలది. కానీ, శ్రీలీలకి కూడా ఎంతో కొంత బాధ్యత వుంటుంది కదా.?
‘భగవంత్ కేసరి’లో నా పాత్ర, భిన్నమైనది కదా.. అంటూ, శ్రీలీల తాజాగా ఓ ప్రశ్నకు బదులిచ్చింది. ఇంతకీ, ‘భగవంత్ కేసరి’ సినిమాలో ఏం చేశావ్.? అని మళ్లీ క్వశ్చన్.
Also Read: చెవికో నగ.! అదిరెను అందాల సెగ.!
నటన పరంగా శ్రీలీలకి సరైన పాత్రలు పడటం లేదు. పడినా, వాటిల్లో శ్రీలీల తన నటనా ప్రతిభను చాటుకునేందుకూ ప్రయత్నించడంలేదు.
క్యూట్‌గా వుంటుంది సరే.. బ్లాంక్ ఎక్స్‌ప్రెషన్స్, అతితో కూడిన చిత్ర విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్.. ఇంతేనా.? శ్రీలీల ఈ విషయంలో ఆత్మ విమర్శ చేసుకోవాల్సి వుంది.
ఒక్కటి మాత్రం నిజం. శ్రీలీల డాన్సులు అదరగొట్టేస్తుంది. అయినాగానీ, ఆ డాన్సులు కూడా బోర్ కొట్టేస్తున్నాయి.
కథకి అడ్డం వస్తున్నాయని ఇటీవలి కాలంలో సినిమా రిలీజ్‌కి ముందు పాటల్ని లేపేస్తుండడం చూస్తున్నాం. ఆ పాటలే శ్రీలీలకి అడ్వాంటేజ్.
మరి, ఆ పాటలే లేపేస్తే.. శ్రీలీలకి ఐడెంటిటీ ఇంకేముంటుంది.?
