Srinivasa Ramanujan.. డిసెంబర్ 22వ తేదీని ‘నేషనల్ మేధమెటిక్స్ డే’గా జరుపుకుంటుంటామని ఎంతమందికి తెలుసు.? సామాన్యులకి తెలియడం ఓ యెత్తు.. ఎంతమంది విద్యార్థులకు ఈ విషయం తెలుసు.?
సినిమా స్టార్లు తెలుసు.. నిత్యం టీవీల్లో కనిపిస్తుంటారు గనుక కొందరు పొలిటీషియన్లూ తెలుసు.! టిక్ టాక్ స్టార్లు.. యూట్యూబర్లు.. వీళ్ళకున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.!
మరి, ప్రఖ్యాత గణిత శాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ గురించి ఎవరికైనా తెలుసా.? ప్చ్.. కష్టమే.!
Srinivasa Ramanujan 1729 నంబర్ ప్రత్యేకత అదే..
శ్రీనివాస రామానుజన్ భారతదేశానికి చెందిన ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త అనొచ్చు. ఎన్నో థీరమ్స్ కనుగొన్నారాయన మేథమెటిక్స్‌లో. విదేశాల్లోనూ ఆయన థీరమ్స్‌కి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది.
ఓసారి హార్డీ అనే మేథమెటీషియన్ ఓ కారులో రామానుజన్ వద్దకు వెళ్ళారు. రామానుజన్ అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆయన్ని పరామర్శించేందుకు వెళ్ళారాయన.

మాటల సందర్భంలో తాను ప్రయాణించిన కారు నంబర్ చెబుతూ, ఆ నెంబర్ (1729)ని ఓ డల్ నంబర్‌గా పేర్కొన్నారు.
‘కాదు’ అని వివరిస్తూ, ఆ నంబర్ తాలూకు ప్రాముఖ్యతను వివరించారు రామానుజన్. వన్ క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ అలాగే నైన్ క్యూబ్ ప్లస్ టెన్ క్యూబ్.. ఇలా రెండు విధాలుగానూ ఈ నంబర్ వస్తుందని పేర్కొన్నారాయన.
అలా ఈ నంబర్‌కి రామానుజన్ – హార్డీ నంబర్ అనే గుర్తింపు లభించింది.
‘1729 – సాధారణమైన నంబర్ కాదు.. రెండు సంఖ్యల ఘనాల మొత్తాన్ని రెండు వేరు వేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యలో ఇది అన్నిటికంటే చిన్నది..’ అని రామానుజన్ ప్రతిపాదించడం.. ఓ అద్భుతం.
‘నేను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజాన్ని కనుగొనడమే’ అని హార్డీ వ్యాఖ్యానించారంటే, అదీ మన శ్రీనివాస రామానుజన్ ప్రత్యేకత.
హార్డీ, లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో గణిత శాస్త్రవేత్తగా పనిచేసేవారు. ఆయన్ని ఉత్తరాల ద్వారా భారతదేశం నుంచి సంప్రదించి, తన థీరమ్స్‌ని ఆయనకు తెలియజేశారు.
అలా హార్డీ, శ్రీనివాస రామానుజన్‌లోని గణిత శాస్త్ర ప్రతిభను గుర్తించి, లండన్ ఆహ్వానించారు. తొలుత శిష్యరికం.. అనుకుంటే, ఇద్దరూ అత్యంత సన్నిహితులయ్యారు.
Srinivasa Ramanujan ఆ నోట్స్.. చాలా చాలా ప్రత్యేకం..
చాలావరకు రామానుజన్ థీరమ్స్ చిన్నచిన్న నోట్‌బుక్స్ మీదనే ఆయన రాసుకునేవారట. అలా చాలా థీరమ్స్ వెలుగులోకి రాకుండానే, కాలగర్భంలో కలిసిపోయాయి.
కాగా, లండన్ వెళ్ళి మేథమెటిక్స్‌లో ఎన్నో థీరమ్స్ కనుగొని, ఎన్నో పరిశోధనలు చేసిన శ్రీనివాస రామానుజన్, అనారోగ్య కారణాలతో తిరిగి స్వదేశానికి వచ్చేశారు.
అనారోగ్యం కారణంగానే చాలా చిన్న వయసులో (32 ఏళ్ళు) ఆయన తుదిశ్వాస విడిచారు.
Also Read: రిషి సునాక్ మనోడేనా.? బాబోయ్ ఏమి ‘కుల’జాడ్యమిది.!
శ్రీనివాస రామానుజన్ 125వ జయంతి సందర్భంగా 2012వ సంవత్సరాన్ని భారత ప్రభుత్వం జాతీయ గణిత శాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది.
మేథమేటిక్స్ అంటే ఏమాత్రం ఇష్టం వున్నవారైనా, శ్రీనివాస రామానుజన్ గురించి తలచుకోకుండా వుండలేరు. కానీ, ఈ తరం వారికి.. మేథమేటిక్స్ అంటే జస్ట్ అదొక మార్కులకు సంబంధించిన సబ్జెక్ట్ మాత్రమే.
అందుకే, శ్రీనివాస రామానుజన్ ప్రతిభ గురించి తెలిసినవారు చాలా చాలా తక్కువమందే అయిపోయారిప్పుడు.