Suhana Khan Dating.. ‘ప్రేమా గీమా అన్నావంటే తోలు తీసేస్తాం..’ అనే తల్లిదండ్రులు ఒకప్పుడు వుండేవారు.
ఇప్పుడు కూడా వున్నారా.? వుండే వుంటారు.. లేకపోతే, ఇంకా ప్రేమ పెళ్ళిళ్ళ చుట్టూ వివాదాలెందుకు నడుస్తాయ్.?
అసలే ఇది కలికాలం.! కొందరు తల్లిదండ్రులైతే తమ పిల్లల డేటింగ్ గురించి ఉచిత సలహాలూ ఇచ్చేస్తున్నారు. ‘ఇద్దరితోనూ ఒకే సమయంలో డేటింగ్ చేయొద్దు..’ అంటూ ఓ తల్లి తన కూతురికి సలహా ఇస్తోంది.
అంటే, ఒకరి తర్వాత ఇంకొకరితో.. అలా ఎక్కువమందితో డేటింగ్ చేయొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నట్టే కదా.?
Suhana Khan Dating.. ఎవరా ‘మహా’తల్లి.? ఏమా కథ.?
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌ది ప్రేమ వివాహం. ఆయన సతీమణి గౌరీ ఖాన్. ఆ గౌరీ ఖాన్, తాజాగా ఓ టాక్ షో ద్వారా తన కుమార్తెకు డేటింగ్ విషయంలో ఉచిత సలహా ఇచ్చింది.
‘ఒకేసారి ఇద్దరితో డేటింగ్‌లో వుండొద్దని నా కూతురికి ఈ టాక్ షో ద్వారా సలహా ఇస్తున్నాను..’ అంటూ గౌరీ ఖాన్ చెప్పుకొచ్చింది.!

అదిరింది కదూ.! అందుకే మరి గౌరీ ఖాన్‌ని ‘మహా’ తల్లి అంటున్నది. ఇంతకీ, టాక్ షోలో అవతలున్న మహానుభావుడెవరబ్బా.?
కాఫీ విత్ కరణ్.. సిల్లీ ఫెలో.!
టాక్ షో అంటే, బూతు వ్యవహారాలు మాట్లాడటానికే సుమీ.. అన్నట్లుంటుంది ‘కాఫీ విత్ కరణ్’ అంటే. అక్కడ ఏమేం ఛండాలం మాట్లాడాలనేదానిపై సెలబ్రిటీలు ముందుగానే ప్రిపేర్ అయిపోవాలి.
అక్కా తమ్ముళ్ళ మీద కూడా అభ్యంతకరమైన రీతిలో ప్రశ్నలు సంధిస్తుంటాడు కరణ్ జోహార్. కలికాలం కదా.! అయినాగానీ, అక్కడికేదో ఆ కలికాలానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు వ్యవహరించడమేంటో.!
Also Read: ప్చ్.! ‘బ్రహ్మాస్తం’ కూడా పనిచేయలేదా.?
అన్నట్టు, ‘మీ కూతురికి డేటింగ్ విషయంలో మీరిచ్చే సలహా ఏంటి.?’ అన్నది కరణ్ జోహార్, గౌరీ ఖాన్ ముందుంచిన ప్రశ్న.
అంతా బాగానే వుందిగానీ, ఏకకాలంలో ఇద్దరితో డేటింగ్ చేస్తే ఏమవుతుంది.? ఏమో, గౌరీ ఖాన్‌కే తెలియాలి.