Surbhi Puranik Colorful Chilaka.. ‘కలర్ ఫుల్లు సిలకా.. నీతో కలర్ ఫోటో దిగుతా..’ అంటూ ఓ హీరో ఓ ముద్దుగుమ్మతో రొమాంటిక్ పాటేసుకున్నాడు. అంతలా ఆ హీరోని మెప్పించిన ఆ అందాల కలర్ ఫుల్ సిలక ఎవరో తెలుసా.?
ముద్దుగుమ్మ సురభి. ‘బీరువా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ నిజంగానే కలర్ ఫుల్ సిలకే. ముట్టుకుంటే కందిపోయే మేని ఛాయ.
చూడగానే అతుక్కుపోవాలనిపించే ఆకర్షణ గల అందం సురభి సొంతం. అయితే, ఇంతందం తెలుగు మేకర్లను ఎట్రాక్ట్ చేయడం లేదెందుకో పాపం.!
Surbhi Puranik Colorful Chilaka.. సక్సెస్ వచ్చినా పట్టించుకోలేదే..
‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘ఒక్క క్షణం’, ‘శశి’ తదితర సినిమాలతో ఓ మోస్తరు సక్సెస్ అందుకున్న సురభి పురానిక్ ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలో నటిస్తోంది.

కామెడీ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. అలాగే, ‘డిడి రిటర్స్’ అనే ఓ తమిళ మూవీలోనూ సురభి (Surbhi Puranik) నటిస్తోంది.
తెలుగులో మరిన్ని మంచి అవకాశాలు దక్కించుకోవాలనుకుంటోంది. అందం, అభినయంతో కట్టి పడేసే సురభి ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీ పూర్తి చేసింది.
అలా టాలెంట్ చూపిస్తోందన్న మాట.!
మోడలింగ్‌పై ఆసక్తితో అందాల పోటీల్లోనూ సత్తా చాటింది. తొలుత తమిళ సినిమాల్లో నటించింది. తర్వాత సందీప్ కిషన్‌తో ‘బీరువా’ సినిమాతో డెబ్యూ చేసింది.
శర్వానంద్ హీరోగా వచ్చిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమా సురభికి మంచి పేరు తీసుకొచ్చింది. సినిమా హిట్ అయినా ఆ తర్వాత అవకాశాలు అంతంత మాత్రమే పలకరించాయ్.

ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు. కానీ, మంచి ఛాన్స్ వస్తే, తెలుగు సినిమాల్నీ అస్సలు వదులుకోనని క్యూట్ క్యూట్‌గా చెప్పేస్తోంది సురభి (Surbhi Puranik).
Also Read: వావ్.! గురూజీని ఇంప్రెస్ చేసిన కేతిక శర్మ.!
ఈ లోపు తెలుగు మేకర్లకు తనదైన గ్లామర్ వలలు విసురుతూ, సోషల్ మీడియాలో టాలెంట్ చూపిస్తోంది. అందులో భాగంగానే రెడ్ కలర్ డ్రస్‌లో స్టైలిష్ పోజులిస్తూ స్పెషల్ ఫోటో సెషన్ చేయించుకుంది సురభి.
మెరిసిపోయే మేని ఛాయకు కాంబినేషన్ రెడ్ కలర్ డ్రస్‌లో ఇంత స్టైలిష్‌గా పోజిస్తే, కుర్ర హృదయాలు గల్లంతైపోవూ.!