Sushmita Sen Lalit Modi.. సుస్మిత సేన్.. పరిచయం అక్కర్లేని పేరిది. విశ్వ సుందరి కిరీటాన్ని అందుకున్న అందగత్తె సుస్మిత. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
తెలుగులో నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘రక్షకుడు’ సినిమాలో సుస్మిత సేన్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడీ అందాల భామ గురించిన చర్చ ఎందుకంటే, లేటు వయసులో ఘాటుగా ప్రేమలో పడింది సుస్మిత. అది కూడా మొదటి సారి కాదు.. అది ఎన్నోసారో.!
Sushmita Sen Lalit Modi.. లలిత్ మోడీని సుస్మిత పెళ్ళాడేసిందా.?
తన బెటర్ హాఫ్.. అంటూ సుస్మిత గురించి సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ కుమార్ మోడీ. దాంతో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు.

మాల్దీవుల్లో ఎంజాయ్ చేసి, లండన్ వచ్చానంటూ పేర్కొన్న లలిత్ మోడీ, ఆ ట్వీటులో సుస్మితని తన బెటర్ హాఫ్‌గా పేర్కొనడమంటే తన భార్యగా సుస్మిత గురించి ప్రస్తావించినట్లే కదా.?
ఇంతలోనే తూచ్ అనేశాడు లలిత్ మోడీ. తాము డేటింగులో వున్నామని సెలవిచ్చాడు. ఏదో ఒకరోజు పెళ్ళి కూడా జరుగుతుందని పేర్కొన్నాడు. అదీ అసలు సంగతి.
డేటింగ్ సుస్మితకి కొత్త కాదు.!
సుస్మిత సేన్ అంటే వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే, ఇద్దరు అమ్మాయిల్ని ఆమె దత్తత తీసుకుంది. పెళ్ళితో పని లేదని చెప్పింది. మగాడి అవసరమే తనకు రాదని కూడా స్పష్టం చేసింది ఓ ఇంటర్వ్యూలో.
Also Read: దటీజ్ కంగన.! దెబ్బ గట్టిగా తగిలేసినా తగ్గేదే లే.!
అమ్మాయిలు పెద్దవాళ్ళయ్యారు.. పెళ్ళీడుకు వస్తున్నారు. ఇంతలోనే, అనూహ్యంగా తనకంటే వయసులో చాలా చిన్నవాడైన రోహ్మన్ షాల్‌తో డేటింగ్ షురూ చేసింది. దాదాపు నాలుగేళ్ళపాటు ఇద్దరూ సహజీవనం చేశారు.
ఎక్కడ తేడా కొట్టిందోగానీ, రోహ్మన్ షాల్‌కి దూరమయ్యింది సుస్మిత. అయితే, తామిద్దరం ఇప్పటికీ మంచి స్నేహితులమని రోష్మన్ చెబుతుంటాడు.
ఇంతలోనే, సుస్మిత విషయమై ‘డేటింగు’ బాంబు పేల్చాడు లలిత్ మోడీ.. ఫొటోలతో సహా.!