బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ మిస్టరీ డెత్‌కి సంబంధించి హీరోయిన్ రియా చక్రవర్తిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. సుశాంత్, తన ఫ్లాట్‌లో విగత జీవిగా కన్పించాడు.. కొద్ది రోజుల క్రితం. రియా – సుశాంత్ (Swara Bhaskar Supports Rhea Chakraborty) మధ్య ప్రేమాయణం నడిచింది.. ఇద్దరూ పెళ్ళి చేసుకుందామనుకున్నారు కూడా.
ఏం జరిగిందో తెలియదు, రియా – సుశాంత్ మధ్య మాత్రం ఓ గొడవ.. ఆ తర్వాత సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఇక, ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పలుమార్లు రియా చక్రవర్తిని విచారించారు. ప్రస్తుతం సీబీఐతోపాటు ఈడీ, నార్కోటిక్స్ విభాగం కూడా రంగంలోకి దిగాయి ఈ కేసు విచారణ నిమిత్తం.
రియా చక్రవర్తి ఓ డ్రగ్ డీలర్‌తో తరచూ మాట్లాడుతుండేదంటూ ఓ వార్త తెరపైకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ తనదైన శౖలిలో స్పందించింది. టెర్రరిస్ట్ కసబ్ కంటే దారుణంగా రియా చక్రవర్తిపై (Rhea Chakraborty) మీడియా అనవసరపు రాద్ధాంతం చేస్తోందంటూ స్వరా భాస్కర్ (Swara Bhaskar) మండిపడింది.
నిజమే.. ఈ కేసులో నిజా నిజాలు తేల్చాల్సింది న్యాయస్థానాలు. సీబీఐ విచారణ జరుగుతోంది గనుక.. మీడియా అత్యుత్సాహాన్ని సమర్థించలేం. అయితే, సుశాంత్ తండ్రి మాత్రం, తన కుమారుడ్ని రియానే చంపేసిందని ఆరోపిస్తుండడం గమనార్హం.
సుశాంత్‌కి (Sushant Singh Rajput) చెందిన కోట్లాది రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్, అతని మరణానికి కొద్ది రోజుల ముందు బ్యాంక్ అకౌంట్ల నుంచి మాయమయ్యింది. దానికీ రియానే కారణమన్న ఆరోపణలున్నాయి. అయినాసరే, న్యాయస్థానం తేల్చకుండా ఎవర్నీ దోషులుగా చూడలేం.
ఇదిలా వుంటే, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కూడా పలు సందర్భాల్లో రియా చక్రవర్తికి మద్దతుగా నిలిచిన విషయం విదితమే. కాగా, చాలామంది బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్ మరణం వెనుక మిస్టరీ వెలుగు చూడాల్సి వుందని అంటున్నారు.
అయితే, బాలీవుడ్‌లోని నెపోటిజంకి సుశాంత్ (Swara Bhaskar Supports Rhea Chakraborty) బలైపోయాడన్న ఆరోపణలూ లేకపోలేదు. ఏదిఏమైనా, ఓ యువ నటుడి మిస్టరీ డెత్‌కి సంబంధించి నిజాలు నిగ్గు తేల్చాల్సిందే. కానీ, ఈ తరహా మిస్టరీలు సినీ పరిశ్రమలో అత్యంత సహజం. చాలా మిస్టరీలు ఇప్పటికీ వీడలేదు. మరి, సుశాంత్ డెత్ మిస్టరీ వీడుతుందో లేదో.!