Taapsee Pannu Pregnancy Marriage వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో తాప్సీ పన్ను తర్వాతే ఎవరైనా.. అని పలు సందర్భాల్లో నిరూపితమయ్యింది.
కాదేదీ, పబ్లిసిటీ స్టంట్స్‌కి అనర్హం.! ఈ మాటని బాగా ఫాలో అవుతుంటుందేమో తాప్సీ (Taapsee Pannu). లేకపోతే, ఇలా ఎందుకు మాట్లాడుతుంది.?
ఓ నెటిజన్, తాప్సీని పెళ్ళి విషయమై ప్రశ్నించాడు. దానికి తాప్సీ చెప్పిన సమాధానం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
Taapsee Pannu Pregnancy Marriage.. నేనేమీ గర్భవతిని కాదు..
నేనేమీ గర్భవతిని కాదు.. గర్భం దాల్చితే కదా, పెళ్ళి గురించి ఆలోచించాల్సింది.. అంటూ తాప్సీ, ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానమిచ్చిన తీరు అందర్నీ విస్మయానికి గురిచేసింది.
ఎవర్నో టార్గెట్‌గా చేసుకుని తాప్సీ ఈ విమర్శలు చేసిందన్నది బహిరంగ రహస్యం. పెళ్ళి కాకుండానే అలియా భట్ (Alia Bhatt) గర్భం దాల్చిందన్న విమర్శలు గతంలో వినిపించాయి.

ఇక, ఇలియానా సంగతి సరే సరి. ఇలియానా (Ileana D Cruz) ఇంతవరకు పెళ్ళి చేసుకోలేదు. కానీ, ఆమె గర్భం దాల్చింది.
చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే. చాలా చాలా పెద్దదే.! కానీ, ఎవరి జీవితం వారిది.! ఈ రోజుల్లో ఇలాంటి విషయాలపై ఎవర్నీ తప్పు పట్టలేం.!
Also Read: Raai Laxmi Soyagam.. అదిరేటి డ్రెస్సు నువ్వేస్తే.!
నేరుగా ఎవర్నో తాప్సీ పన్ను (Taapsee Pannu) టార్గెట్ చేసింది. అదెవరన్నదానిపై రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో.
ఒక్కటి మాత్రం నిజం.. తాప్సీకి నోటి దురుసుతనం ఎక్కువే. అంతేనా, ట్వీటు దురుసుతనం కూడా ఎక్కువేనని తాజాగా నిరూపితమయ్యింది.