Tamannaah Bhatia F3 Movie.. ‘ఎప్3’ సినిమా సందడి ఎప్పుడో ముగిసిపోయింది. కానీ, ఈ సినిమా ప్రమోషన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా ఎందుకు కనిపించలేదు.? అన్న ప్రశ్న చుట్టూ ఇంకా రచ్చ కొనసాగుతూనే వుంది.
దర్శకుడు అనిల్ రావిపూడికీ, హీరోయిన్ తమన్నా భాటియాకీ మధ్య ‘ఏదో జరిగింది’ అన్న ప్రచారం సినిమా (F3 Movie) విడుదలకు ముందే తెరపైకొచ్చింది. ‘అబ్బే, అదేం లేదు..’ అంటూ చిత్ర యూనిట్ కవరింగ్ చేసుకుంది.
పెద్ద గొడవలేమీ లేవుగానీ.. అంటూ ఓ ఇంటర్వ్యూలో అసలు విషయం చల్లగా చెప్పేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
Tamannaah Bhatia F3 Movie ఎందుకిలా చేసినవ్.?
ముందుగా అనుకున్న ప్రకారం తమన్నా, షూట్ సమయం పూర్తవగానే వెళ్ళిపోవాలనుకుందనీ, అయితే, కొంత పార్ట్ పెండింగ్ వుండడంతో కాస్సేపు వుండమని అడిగామనీ.. ఈ విషయంలో తలెత్తిన కమ్యూనికేషన్ తప్ప, పెద్దగా వివాదమేమీ లేదని దర్శకుడు అనిల్ చెప్పిన సంగతి తెలిసిందే.

అనిల్ ఈ విషయం చెప్పి రోజులు గడుస్తున్నా, ఈ వ్యవహారంపై ఇంతవరకు తమన్నా స్పందించలేదు. ‘కేన్స్‌కి వెళ్ళింది.. ఇతరత్రా పనులతో బిజీగా వుంది.. అందుకే ప్రమోషనల్ ఇంటర్వ్యూలకు రాలేదు.. కానీ, ఖచ్చితంగా వస్తుంది, సినిమాని ప్రమోట్ చేస్తుంది’ అని అనిల్ చెప్పినా, తమన్నా లైట్ తీసుకుంది.
మిల్కీ బ్యూటీని అవమానించారా.?
సో, ఇక్కడ విషయం, వివాదం సుస్పష్టం. తమన్నా (Milky Beauty Tamannaah Bhatia), ‘ఎఫ్3’ సినిమాని లైట్ తీసుకుంది. సోషల్ మీడియాలో ట్వీట్లేయడంతో సరిపెట్టింది.
దర్శకుడు అనిల్ రావిపూడితో (Anil Ravipudi) టెర్మ్స్ ఏమాత్రం సెట్ అయినా, కనీసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చేది.. లేదా వీడియో బైట్ అయినా వదిలి వుండేది.
Also Read: గోవిందా.! నయనతార తెలియక తప్పు చేసిందా.?
నిజానికి, తమన్నా (Tamannaah Bhatia) గతంలో ఇలా ఎప్పుడూ చేసింది లేదు. అంటే, తమన్నాకి పెద్ద అవమానమే జరిగి వుండాలి. అదేంటి.? ఇప్పటికైతే సస్పెన్సే ఇది.